ప్రజలకు బాబు మెచ్చుకోలు, ఎత్తుకున్నారు (పిక్చర్స్)

విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖలో పర్యటించారు. హుధుద్ తుఫానును నగర ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. విపత్తులోనూ ప్రజలు ధైర్యంగా నిలబడ్డారని, ప్రకృతికి ఎదురొడ్డి నిలబడ్డార అన్నారు. తన జీవితంలో ప్రజలు అందించిన సహకారాన్ని మరిచిపోలేనని ఆయన అన్నారు. హుధుద్ తుఫాను తర్వాత 35 రోజుల్లో చాలా సమస్యలను అధిగమించామన్నారు.

అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడ్డారు. తెలంగాణ నేతలు అనవసర రాద్ధాంతాలకు దిగుతున్నారని, విద్వేషాల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి చెందవని చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్యనున్న సమస్యలపై కూర్చుని చర్చించుకుందామని తను పదేపదే కేసీఆర్‌కు చెపుతున్నానన్నారు. అవసరమైతే పెద్దమనుషులను కూర్చోపెట్టి మాట్లాడుకుందామని మరోసారి ప్రతిపాదించారు.

విభేదాల వల్ల విద్యార్థుల భవిష్యత్ బలికాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖలో వనమహోత్సవ, వనభోజన కార్యక్రమాలను సోమవారం అధికారికంగా నిర్వహించారు. అనంతరం తుపాను తరువాత ప్రజలకు అందించిన సాయం గురించి అధికారులతో సమీక్షించారు. తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 చంద్రబాబు

చంద్రబాబు

విశాఖపట్నం నగరాన్ని మళ్లీ సుందరనగరంగా తీర్చి దిద్దే బాధ్యత తనదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా, పరిశ్రమల హబ్‌గా మారుస్తామని ఆయన చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటారని ఆయన అన్నారు. మొక్కలు నాటిని తర్వాత విశాఖ వాసులతో హరిత ప్రతిజ్ఞను చేయించారు. తమ నగరాన్ని హరిత విశాఖగా తయారు చేయడంలో భాగస్వాములమవుతామని, ప్రతీ ఇంటికీ ఒక మొక్కను నాటి దాన్ని పరిరక్షించనున్నట్లు ప్రతిజ్ఞ చేయించారు.

చంద్రబాబు

చంద్రబాబు

అలాగే విశాఖ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చదిద్దుకుంటామని, వారానికి రెండు గంటల సమయాన్ని స్వచ్ఛ హరిత విశాఖకు కేటాయిస్తామని విశాఖ ప్రజల చేత చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.

చంద్రబాబు

చంద్రబాబు

అనంతరం నగరంలో ఎక్కడ మొక్కలు నాటారో తెలుసుకునే విధంగారూపొందించిన జియోటాగ్‌ సాఫ్ట్‌వేర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ రోజు విశాఖలో 79వేల చెట్లను నాటుతున్నామన్నారు. విశాఖలో పచ్చదనం ఎంత ఉందనేది తెలుసుకునేలా సాంకేతిక పరిజ్ఞానం రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అనంతరం భారతీయ కిసాన్‌సంఘ్‌ ఆధ్వర్యంలో రైతులకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాను జపాన్ పర్యటనకు వెళ్ళే ముందే ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా గురించి చర్చిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియచేశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అలాగే విశాఖకు రైల్వే జోన్ రావాల్సి ఉందని, దీనిపైనా కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు విశాఖకు రానున్నాయని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖను లాజిస్టిక్ హబ్‌గా తయారు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖకు మాన్యుఫ్యాక్చరింగ్ కర్మాగారాలు పెద్ద సంఖ్యలో రానున్నాయని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు


ఇండిగో విమానయాన సంస్థ విశాఖను హబ్‌గా చేసుకోడానికి ఎంఓయు కుదుర్చుకుందని చెప్పారు. అలాగే సిల్క్‌ఎయిర్‌వేస్ కూడ విమాన సర్వీసులను విశాఖ నుంచి ప్రారంభించనుందని చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు, ఇక్కడే మరొక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి తెలియచేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

కంటైనర్ రవాణా వ్యవస్థను మెరుగుపరచి, తీరం వెంబడి పోర్టులన్నింటినీ అభివృద్ధి చేసి, విశాఖను గేట్ వే ఆఫ్ ఇండియాగా మార్చనున్నట్టు చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

దీంతోపాటు పర్యాటక రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా విశాఖను తీర్చిదిద్దుతానని చంద్రబాబు చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ బదులు, విశాఖ మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి, దానికి తానే చైర్మన్‌గా వ్యవహరించదలిచానని స్పష్టం చేశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

హధుద్ నష్టంపై 3రోజుల్లో నివేదిక విశాఖలో సంభవించిన హుదూద్ తుపాను నష్టాన్ని పూర్తిస్థాయిలో మూడు రోజుల్లో అంచనా చేసి, సమగ్ర నివేదికను కేంద్రానికి పంపిస్తామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

తుపాను వచ్చిన తరువాత ఉత్తరాంధ్ర ప్రజలకు సుమారు 250కోట్ల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు అందించామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేంద్రం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలను ప్రకటించిందని, ఇప్పటి వరకూ సుమారు 400 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

వారంరోజుల్లో కేంద్ర బృందం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తుందని చెప్పారు. ఈలోగా ఇప్పటి వరకూ తమకు అందిన విరాళాల నుంచి కొంత మొత్తాన్ని విడుదల చేసి, దాన్ని పాఠశాలల మరమ్మతుకు వినియోగిస్తామని చంద్రబాబు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+