యూఎస్ ప్రతినిధులతో బాబు, 'బెజవాడ'పై ఇంటర్నేషనల్ ప్లాన్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. పలువురితో ఆయన భేటీ అయ్యారు. అమెరికా ప్రతినిధులతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో అమెరికా రాజకీయ సహాయ కార్యదర్శి పునీత్ తల్వార్ భేటీ అయ్యారు. విజయవాడలో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

చంద్రబాబును కలిసిన అమెరికా ప్రతినిధుల్లో.. పునీత్ తల్వార్‌తో పాటు డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అతుల్ కాశ్యప్, కెన్నెత్ హ్యాండిల్మన్, కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ తదితరులు ఉన్నారు. రాజధాని నిర్మాణం మరో రెండు మూడు నెలల్లో ప్రారంభిస్తామని చంద్రబాబు వారికి తెలిపారు. మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యత సింగపూర్ తీసుకుందని చెప్పారు. సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ఈ నెల్లో ఏపీకి వస్తారని చెప్పారు.

ఈస్ట్రన్ నేవీకి విశాఖ కేంద్రంగా పని చేస్తోందని సీఎం వారికి వివరించారు. డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో ఏపీకి పెట్టుబడులు పెట్టాలన్న యూఎస్ ప్రతిపాదనను స్వాగతించారు. మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు సర్వీస్ సెక్టారులో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని వారికి చంద్రబాబు చెప్పారు. ఐటీతో పాటు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆగ్రో ప్రాసెసింగ్, పెట్రో కెమికల్స్, టూరిజంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఓడ రేవులతో త్వరలో ఏపీ లాజిస్టిక్ హబ్‌గా మారనుందన్నారు.

అనంతరం చంద్రబాబు భారత్ ఎయిర్ పోర్ట్ అథారిటీతో మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయం గురించి ఆయన వారితో చర్చించారు. ఇదిలా ఉండగా, గణతంత్ర వేడుకలకు రానున్న అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాను ఏపీకి రప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. ఆయన అమెరికా ప్రతినిధులతో భేటీ అయిన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. సచివాలయంలో అమెరికా ప్రతినిధులతో...

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. సచివాలయంలో అమెరికా ప్రతినిధులతో...

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. మెరికా రాజకీయ సహాయ కార్యదర్శి పునీత్ తల్వార్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో బాబు చర్చ.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో విజయవాడ పోర్ట్ పైన చర్చించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో విజయవాడ పోర్ట్ పైన చర్చించారు. విజయవాడ పోర్ట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+