వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, టీ మనసులు కలిసే...: సర్దుకుపోదాం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇరు రాష్ట్రాలు విడిపోయినా, మనుషులు విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయని, ఇద్దరం స్పీకర్లం ఎప్పుడైనా కలుస్తామని ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్ మంగళవారం అన్నారు.

మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమయ్యారు.

సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్ రాజాసదారామ్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి (ఇన్‌ఛార్జీ) సత్యనారాయణ, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు హాజరయ్యారు.

స్పీకర్లు

స్పీకర్లు

ఇరు రాష్ట్రాలు విడిపోయినా, మనుషులు విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయని, ఇద్దరం స్పీకర్లం ఎప్పుడైనా కలుస్తామని ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్ మంగళవారం అన్నారు.

 స్పీకర్లు

స్పీకర్లు

మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమయ్యారు.

స్పీకర్లు

స్పీకర్లు

సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్ రాజాసదారామ్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి (ఇన్‌ఛార్జీ) సత్యనారాయణ, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు హాజరయ్యారు.

 స్పీకర్లు

స్పీకర్లు

ఈ సందర్భంగా కోడెల మాట్లాడారు. అసెంబ్లీ భవనాల కేటాయింపుపై అవగాహనకు వచ్చామన్నారు. మంత్రుల ఛాంబర్లు, పార్టీల కార్యాలయాలపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు చెప్పారు.

 స్పీకర్లు

స్పీకర్లు

ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలేమీ లేవని కోడెల చెప్పారు. అన్ని విషయాల్లోనూ పరస్పర అవగాహనకు వచ్చామన్నారు. సమన్వయంతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

 స్పీకర్లు

స్పీకర్లు

ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఛాంబర్ల కేటాయింపు ఇతరత్రా విషయాల్లో పంతాలు పట్టింపులు లేకుండా పరస్పర సహకారంతో, సజావుగా నిర్వహించుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది.

 స్పీకర్లు

స్పీకర్లు

యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాజకీయంగా ఉన్న మనం సహకరించుకుని వెళ్దామనుకున్నా, ఇరు రాష్ట్రాల కార్యదర్శులు పట్టింపులు వీడటం లేదని అన్నారని తెలుస్తోంది.

 స్పీకర్లు

స్పీకర్లు

ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి ఉన్న ఛాంబర్‌ను ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కేటాయించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

 స్పీకర్లు

స్పీకర్లు

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సదారామ్ ఛాంబర్‌ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్‌కు కేటాయించాలని రామకృష్ణుడు చెప్పారు.

 స్పీకర్లు

స్పీకర్లు

రెండు అసెంబ్లీలకు మీడియా కమిటీలను నియమించాలని, పాసులు వేర్వేరుగా ఇవ్వాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఛాంబర్‌ను యధావిధిగా ఆమెకే కొనసాగించాలని నిర్ణయించారు.

 స్పీకర్లు

స్పీకర్లు

సమావేశం అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద రావు, టి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామని చెప్పారు.

English summary
Ahead of the budget sessions of Andhra Pradesh and Telangana legislature shortly, presiding officers of the Assembly and Council of the two States held a crucial meeting to thrash out irritants over allotment of buildings and office chambers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X