వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్ చీటర్స్, కారు దొంగ అసి. కెమెరామెన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: బ్యాంకు ఉద్యోగులమని చెప్పి వినియోగదారులను మోసగిస్తున్న అంతర్ జిల్లా దొంగలను ఆనందపురం పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వారి వద్ద నుండి రూ.3.14 లక్షలు, రెండున్నర తులాల రెండు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన షేక్ నాగూర్ మీరా వల్లి మద్దిలపాలెం, పిఠాపురం కాలనీలో నివసిస్తున్నాడు. మధ్యలోనే చదువు మానేసి వ్యసనాలకు అలవాటు పడ్డాడు. వాటి కోసం దొంగతనాలకు పాల్పడేవాడు. మొత్తం 18 కేసుల్లో ఇతనికి సంబంధం ఉంది. ఆ కారణంగా అతడిని రాజమండ్రి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

జైలు నుండి వచ్చిన తర్వాత అతనిలో మార్పు రాలేదు. అతనికి శివాజీపాలేనికి చెందిన రాముతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో బ్యాంకుల వద్ద మాటు వేసి, దొంగతనాలకు పాల్పడేవారు.

బ్యాంక్ చీటర్స్

బ్యాంక్ చీటర్స్

వీరు బ్యాంకుకు వచ్చిన వారికి తాము బ్యాంకు ఉద్యోగులమని, బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఉచిత బహుమతులు ఇస్తున్నారని నమ్మబలుకుతారు. వారి వద్ద నుండి డిపాజిట్ సొమ్మును తీసుకొని బ్యాంకు మేనేజర్ చాంబర్లోకి వెళ్లి ఆయనతో మాట్లాడినట్లు ఖాతాదారులకు నమ్మకం కలిగిస్తుంటారు.

బ్యాంక్ చీటర్స్

బ్యాంక్ చీటర్స్

అక్కడి నుండి బయటకు వచ్చి మీ పని అవుతుందని చెప్పి.. ఇక్కడే ఉండాలని.. తీసుకున్న సొమ్ముతో వారు పరారవుతుంటారు. తర్వాత మోసపోయామని తెలుసుంటున్న బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

బ్యాంక్ చీటర్స్

బ్యాంక్ చీటర్స్

ఇలా వీరు ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన నిందితులుద్దరు వెల్లంకి ఎస్‌బిఐ వద్ద రమణతో పరిచయం పెంచుకొని రూ.80వేలు కాజేశారు. దీంతో బాధితుడు ఆనందపురం పోలీసులను ఆశ్రయించారు.

రిమాండ్ ఖైదీ

రిమాండ్ ఖైదీ

మరోవైపు, విశాఖ కేంద్రకారాగారంలో మంగరాజు అనే రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.య ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా పుట్టమర్రి గ్రామానికి చెందిన ఇతను పదహారు కేసుల్లో నిందితుడు.

రిమాండ్ ఖేదీ

రిమాండ్ ఖేదీ

అనుమానాస్పదంగా మృతి చెందిన రిమాండ్ ఖేదీ... మావోయిస్టులతో సంబంధాలు, హత్య, కిడ్నాప్, మారణాయుధాలు కలిగి ఉన్న కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2010లో విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.

కారు దొంగ

కారు దొంగ

పార్కు చేసిన కారును అపహరించిన వ్యక్తిని టూటౌన్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ నెల 20న బిగ్ బజార్ ఎదుట ఓ వ్యక్తి కారు నిలిపి.. తాళం తీయకుండా పోయాడు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేస్తున్న రాజమండ్రికి చెందిన సూర్యబాబు కారు తీసుకొని పరారయ్యాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Photos of Bank cheaters arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X