వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీరకట్టిన చంద్రబాబు ఫ్లెక్సీ, టీవిల్లో టి సంబరం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో తెలంగాణవాదులు గురువారం రాత్రి సంబరాల్లో మునిగి తేలారు.

మరోవైపు విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ 3 దారి చూపించారని సమైక్యవాదులు మండిపడుతున్నారు.

లేఖ ఇవ్వడమే కాకుండా, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించారంటూ విశాఖ కాంగ్రెసు కార్యకర్తలు చీరకట్టిన చంద్రబాబు ఫ్లెక్సీని ఏర్పాటు చేసి దగ్ధం చేశారు.

చంద్రబాబు 1

చంద్రబాబు 1

విశాఖపట్నంలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చీరకట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీని దగ్ధం చేస్తున్న దృశ్యం.

చంద్రబాబు 2

చంద్రబాబు 2

విశాఖపట్నంలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చీరకట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీని దగ్ధం చేస్తున్న దృశ్యం. కేంద్రానికి తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారని, సోనియాను విమర్శించారని వారు మండిపడ్డారు.

గన్ పార్కు 1

గన్ పార్కు 1

తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేయగానే తెలంగాణ భవన్‌లో సంబురాలు అంబరాన్ని తాకాయి. కార్యకర్తలు గులాబీ రంగు చల్లుకుంటూ 'కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు.

గన్ పార్కు 2

గన్ పార్కు 2

అనేక అవమానాలు, కష్టానష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని బిజెపి నగర అధ్యక్షుడు బి వెంకట్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

గన్ పార్కు 3

గన్ పార్కు 3

తెలంగాణ ప్రజల చిరకాలం వాంఛ నేటికి నెరవేరిందన్నారు. ఎంతో మంది తెలంగాణ సాధనకు ఆత్మబలిదానాలు చేశారని, వారి త్యాగఫలమే ప్రత్యేక రాష్ట్ర సాధన అన్నారు. తెలంగాణ నవ నిర్మాణంలో బిజెపి పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.

గన్ పార్కు 4

గన్ పార్కు 4

తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం పట్ల విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. విద్యార్థులు జై తెలంగాణ.. నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఓయూ ఆర్ట్స్ కళాశాలకు చేరుకుని బాణాసంచా పేల్చారు.

గన్ పార్కు 5

గన్ పార్కు 5

లోకసభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు గురువారం రాజ్యసభలో కూడా నెగ్గిందని.. తెలంగాణ ప్రజలకు ఇది ఒక చరిత్రాత్మక దినమని మంత్రి డీకే అరుణ అన్నారు.

గన్ పార్కు 6

గన్ పార్కు 6

ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులున్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని బిల్లును ఆమోదింప చేశారని డికె అరుణ అన్నారు.

గన్ పార్కు 7

గన్ పార్కు 7

హైదరాబాద్‌లో విజయోత్సవ సభ నిర్వహించనున్నామని, ఆ సభకు సోనియాను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నామని అరుణ చెప్పారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడంతో చాలా సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ 1

తెలంగాణ 1

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందనే వార్త తెలియగానే తెలంగాణవాదులంతా గన్‌పార్క్‌కు చేరుకుని 'జై తెలంగాణ.. తెలంగాణ అమరవీరులకు జోహార్లు.. సాధించాం.. సాధించాం.. తెలంగాణ సాధించాం' అంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ 2

తెలంగాణ 2

నిజాం కాలేజీ, ఓయూ విద్యార్థులు, న్యాయవాదులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల నేతలు అక్కడికి చేరుకొని అమరవీరులకు నివాళి అర్పించారు.

తెలంగాణ 3

తెలంగాణ 3

రాష్ట్ర విభజన బిల్లు గట్టెక్కడానికి రాజ్యసభలో బిజెపి అర్థవంతమైన పాత్రను పోషించిందని ఆ పార్టీ తెలియజేసింది. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించగానే నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి తరలివచ్చి మిఠాయిలు పంచుకుని, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

తెలంగాణ 4

తెలంగాణ 4

బిజెపి నాయకులు వెంకయ్యనాయుడు, ప్రకాష్ జవదేకర్, అరుణ్ జైట్లీ సాగించిన చర్చతో బిల్లుకు ఆమోదం లభించిందని బిజెపి నేతలు చెప్పారు.

తెలంగాణ 5

తెలంగాణ 5

ఉద్యమంలో అమరులైన వారందరికీ పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తోందని, అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని తెలంగాణవాదులు చెప్పారు.

తెలంగాణ 6

తెలంగాణ 6

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోకసభ, రాజ్యసభల్లో ఆమోదించడానికి కృషి చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ సమావేశం కృతజ్ఞతలు తెలిపింది.

తెలంగాణ 7

తెలంగాణ 7

ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చి మాటకు కట్టుబడి సోనియాగాంధీ బిల్లును పాస్ చేయించిందని ఓబీసీ సెల్ చైర్మన్ నాగేష్ ముదిరాజ్, పిసిస ప్రధాన కార్యదర్శి పల్లె లక్ష్మణ్ గౌడ్ పేర్కొన్నారు.

తెలంగాణ 8

తెలంగాణ 8

లోకసభలో, రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించడం పట్ల లాల్‌దర్వాజా మహంకాళీ ఆలయ బోనాల కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ 9

తెలంగాణ 9

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్కృతీ- సంప్రదాయాలకు అనుగుణంగా యేడు బోనాల ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

తెలంగాణ 10

తెలంగాణ 10

గురువారం సాయంత్రం రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఏకగ్రీంగా ఆమోదం పొందడంతో లాల్‌దర్వాజా ఆలయం వద్ద విజయోత్సవాలు నిర్వహించారు.

తెలంగాణ 11

తెలంగాణ 11

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో నిమ్స్ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిమ్స్ ఆవరణలో సంబురాలు జరుపుకున్నారు.

తెలంగాణ 12

తెలంగాణ 12

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని, సీమాంధ్ర ప్రజలను మోసం చేసింది సీమాంధ్ర నాయకులేనని తెలంగాణవాదులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ భవన్ వద్ద అహింసా మార్గం ద్వారా సాధించలేదనిది ఏదీ లేదని మరోసారి నిరూపించిన కెసిఆర్ ఆంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దృశ్యం.

English summary
Congress Activists Burning Effuji of Chandrababu Naidu at Vishakapatnam alleged Letter to Centrel Government for Telangana State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X