విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు చెబుతుంటే, ఎమ్మెల్యేలు విన్నారిలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రవర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధిని అన్ని జిల్లాల్లో వికేంద్రీకరించేందుకు రాష్ట్రంలో మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామన్నారు.

ప్రపంచస్ధాయి ప్రమాణాలతో కూడిన రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తి స్ధాయిలో సహాయం ఉంటుందని కేంద్రం భరోసా ఇచ్చిందన్నారు. ప్రజల నుంచి శివరామకృష్ణన్ కమిటీకి అందిన వినతుల్లో 50 శాతం అభిప్రాయాలు విజయవాడ-గుంటూరు పరిసర ప్రాంతం రాజధాని ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రదేశమని అనుకూలంగా వచ్చాయన్నారు. ఈ నెల 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో విజయవాడ పరిసరాల్లోనే అనువైన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూమిని సేకరిస్తామన్నారు. ఈ సందర్భంగా విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు ప్రతిపక్షనేత జగన్ ప్రకటించారు. గురువారం ఇక్కడ శాసనసభలో రాజధాని ప్రదేశంపై ఉదయ 11.10 గంటలకు తొలుత చంద్రబాబు ప్రకటన చేశారు. గందరగోళం నెలకొనడంతో మళ్లీ సభ ప్రారంభమైన తర్వాత 12.05 నిమిషాలకు చంద్రబాబు విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అంటూ ప్రకటన చేసి గంటన్నర సేపు ప్రసంగించారు.

చంద్రబాబు ప్రకటన

చంద్రబాబు ప్రకటన

తాము రాజధాని అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, అన్ని సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. అధికార, విపక్ష పార్టీలు నిర్మాణాత్మకంగా పనిచేసి విభజనతో గాయపడిన ప్రజల విశ్వాసాన్ని చూరగొనే సమయం ఆసన్నమైందని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు ప్రకటన

చంద్రబాబు ప్రకటన

విజయవాడ పరిసరాల్లో వచ్చే రాజధానికి సహకరించకపోయినా ఫర్వాలేదని, కాని భూసేకరణకు అడ్డుపుల్లలు వేయరాదని ఆయన విపక్షాలను కోరారు.

చంద్రబాబు ప్రకటన

చంద్రబాబు ప్రకటన

జగన్ సూచించినట్లుగా 30 లేదా 50 వేలు లేదా ఒక లక్ష ఎకరాల భూమి అడవుల్లోనే దొరకుతుందని, రాజధాని అంటే ఒక సామాజిక జీవితం, వినోదం, వౌలిక సదుపాయాలు, ఒక విమానాశ్రయం, ప్రజలు తక్షణ అవసరాలు తీర్చే విధంగా కనీస వసతి సదుపాయాలు ఉండాలన్నారు.

 చంద్రబాబు ప్రకటన

చంద్రబాబు ప్రకటన

తనకు తన సొంత జిల్లాలో తిరుపతిలో రాజధాని పెట్టుకుంటే బాగుంటుందని, ఇంటికి సమీపంలోనే పదివేల ఎకరాల స్ధలం ఉందని, సచివాలయానికి రోజూ నడిచి వెళ్లి రావొచ్చని, కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరికీ అనుకూలంగా సమాన దూరంలో ఉన్న విజయవాడ పరిసరాల్లో రాజధానిని నిర్మిస్తామన్నారు.

చంద్రబాబు ప్రకటన

చంద్రబాబు ప్రకటన

సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఏడు మిషన్లను, ఐదు గ్రిడ్‌లను, నాలుగు విభిన్న సందేశాత్మక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు.

English summary
Photos of AP CM Chandrababu Naidu announcing capital of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X