టిలో బిసి కార్డ్: బ్రాండీ కాదని కెసిఆర్‌కి బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పట్టు నిలుపుకోవడం కోసం చంద్రబాబు బడుగులకే రాజ్యాంధికారం ఇస్తామని చెబుతున్నారు. అధికారంలోకి బడుగులకే వారికే ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారు. ఇదే నినాదంతో తెలంగాణలోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు తెలంగాణ టిడిపి ఫోరం ఎమ్మెల్యేలు ఆమోద ముద్ర వేశారు. రంగారెడ్డి జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి ముందు శనివారం టిటిడిపి ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో బిసిలకే ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ప్రకటిద్దామని చంద్రబాబు చెప్పారు.
టిడిపిలో తన దగ్గర పని చేసి శిక్షణ తీసుకొన్న కెసిఆర్.. ఇప్పుడు గురువుకు పంగనామాలు పెట్టినట్లు వ్యవహరిస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలో టిడిపిని ఖాళీ చేస్తామని కొందరు భ్రమ పడుతున్నారని, ఖాళీ చేయడానికి అది బ్రాందీ బాటిల్ కాదని వ్యంగ్యంగా అన్నారు. టిడిపి కార్యకర్తల ఫ్యాక్టరీ అని, ఒకరు పోతే వందమంది తయారవుతారని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు
తెలంగాణకు త్వరలోనే కమిటీని వేస్తానని చంద్రబాబు ఈ భేటీలో చెప్పారు. తెలంగాణలో నాలుగుచోట్ల ప్రజా గర్జనలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ల్లో త్వరలో వీటిని నిర్వహిస్తారు.

చంద్రబాబు
చంద్రబాబు ఇక్కడి నుంచి పోతున్నాడని, ఇక ఇక్కడ టిడిపి ఉండదని కొందరు పెత్తందార్లు కలలు కంటున్నారని, తాను ఎక్కడికీ పోనని, ఇక్కడే ఉంటానని చెప్పారు. పార్టీని కంటిపాపలా కాపాడుకుంటానన్నారు.

నాయుడు
తెలంగాణలోనూ టిడిపిని గెలిపించి బడుగుల చేతికి రాజ్యాధికారం అప్పగించి నడిపిస్తానని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, దానిని కంటిపాప మాదిరిగా కాపాడుకుంటానని అన్నారు.

రంగారెడ్డి జిల్లా నేతలు
పార్టీ మంచిచెడులు మొత్తం చూసుకుంటానని, తెలంగాణలో తాను కూడా ఊహించనంతగా చాలా చోట్ల టిడిపికి అనుకూలంగా మార్పు వస్తోందన్నారు. రెండు రాష్ట్రాల్లో టిడిపి గెలుపు ఖాయమన్నారు.

టిడిపి
తెలుగుదేశాన్ని జాతీయ పార్టీని చేసి అన్ని రాష్ట్రాల్లో శాఖలు పెట్టి వాటి బాగోగులు చూసుకుంటానని, కేంద్రంలో కూడా మంచి పాత్ర పోషించడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications