వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రపోనని బాబు, నవ్విన మురళీమోహన్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: పేద కుటుంబాలకు సగం ధరకే చీర, ధోవతి అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపుర మండలం అంగర గ్రామంలో నిర్వహించిన జన్మభూమి సభలో చేనేత కార్మికులు, మహిళలు, రైతులు, పేదలు తదితర వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు.

పేద కుటుంబాలకు సగం ధరకు చీర, ధోవతి అందించి ప్రయోజనం కల్పించటంతో నేత కార్మికులకు కూడా న్యాయం జరుగుతుందన్నారు.

 జన్మభూమి

జన్మభూమి

చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలపై 30శాతం సబ్సిడీ ఇస్తామని, వారి రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

 జన్మభూమి

జన్మభూమి

పదేళ్ల తరువాత మళ్లీ జన్మభూమిలో పాల్గొని ప్రజలతో మమేకం కావటం, ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తేవటం ఆనందంగా ఉందన్నారు.

 జన్మభూమి

జన్మభూమి

రాష్ట్ర విభజనలో గత కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

 జన్మభూమి

జన్మభూమి

అయినప్పటికీ సమస్యల నుంచే అవకాశాలు వెదికే నైజం ఉన్న తాను మళ్లీ ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు.

 జన్మభూమి

జన్మభూమి

రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి తనకు అధికారాన్ని ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునే వరకు నిద్రపోనని చంద్రబాబు నాయుడు చెప్పారు.

 జన్మభూమి

జన్మభూమి

రైతును రుణ విముక్తుడిని చేసి తీరతాననన్నారు. రైతులకు 1.5లక్షల వరకూ రుణాన్ని మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు.

 జన్మభూమి

జన్మభూమి

దీపావళికి ముందురోజు 22న రైతు సాధికార సంస్థ ప్రారంభించి, దాని ద్వారా రైతుల రుణాల్లో 20 శాతాన్ని అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

 జన్మభూమి

జన్మభూమి

చిన్న రైతులకు ముందుగా రుణ మాఫీ వర్తింపచేసి, మిగిలిన రైతులకు నాలుగు వాయిదాల్లో 10శాతం వడ్డీ చెల్లింపు ద్వారా చెల్లిస్తామన్నారు.

జన్మభూమి

జన్మభూమి

సాధికార సంస్థకు వివిధ మార్గాల్లో నిధులు సమీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు.

 జన్మభూమి

జన్మభూమి

మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రూ.10వేలు చొప్పున రుణ మాఫీ చేసేందుకు రూ.8వేల కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

 జన్మభూమి

జన్మభూమి

డ్వాక్రా సంఘాల సృష్టికర్తను తానేనని చంద్రబాబు చెప్పారు. తాను సృష్టించిన మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత తన పైనే ఉందన్నారు.

జన్మభూమి

జన్మభూమి

మహిళా సంఘాల రుణాలపై వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే స్వీకరిస్తుందన్నారు. ఇసుక లాభాల్లో 25శాతం మహిళా సంఘాలకు, మిగిలిన 75 శాతాన్ని రైతుల సంక్షేమానికి కేటాయిస్తామన్నారు.

 జన్మభూమి

జన్మభూమి

దీనివల్ల అటు మహిళలు, ఇటు రైతుల సమస్యలు కూడా తీరుతాయన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని ప్రకటించారు.

 జన్మభూమి

జన్మభూమి

అనర్హులకు పింఛన్లు అందకూడదన్నదే తన ఉద్దేశ్యమని, ఎక్కడయినా అర్హులకు పింఛన్లు అందకపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

 జన్మభూమి

జన్మభూమి

వృద్ధులు, వితంతువులకు రూ.200 నుండి 1000, వికలాంగులకు రూ.500 నుండి రూ.1500 పింఛను పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.

 జన్మభూమి

జన్మభూమి

ప్రతి ఒక్కరూ నీరు- చెట్టు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

జన్మభూమి

జన్మభూమి

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటలు కరెంటు ఇస్తున్నామని, ఇది భవిష్యత్తులో కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు.

 జన్మభూమి

జన్మభూమి

ఫైబర్ ఆప్టికల్ కేబుళ్ల ద్వారా ఇకనుంచి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం వస్తుందని, అప్పుడు మహిళలు తమ తెలివితేటలను వినియోగించుకుని మరింత అభివృద్ధి చెందాలన్నారు.

 జన్మభూమి

జన్మభూమి

రేషన్ బియ్యం కూడా సక్రమంగా అర్హులకే అందేలా ఒక విధానాన్ని రూపొందిస్తామన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా, నాలెడ్జ్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని, ఉద్యోగులు కూడా రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని కోరారు.

English summary
Photos of CM Chandrababu Naidu in Janmabhoomi programme at Anaparthi in East Godavari Dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X