జగన్‌ను తరమండి: బాబు చంకలో చిన్నారి (పిక్చర్స్)

చిత్తూరు: రాష్ట్ర విభజన ప్రక్రియ తీరు పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మండిపడ్డారు. ఇష్టానుసారం విభజించడం సరికాదన్నారు.

ఢిల్లీలో రాజకీయ పార్టీలను జివోఎం పేరుతో ఇంటర్వ్యూ చేస్తారా? ఆ ఇంటర్వ్యూలకు వీళ్లు వెళ్లి సమాధానాలు చెప్పొస్తారా? అందరూ కలిసి కుతంత్రాలతో ఇ-మెయిల్‌లపై రాష్ట్ర విభజనకు తెగబడతారా? అంటూ ప్రశ్నించారు.

ఏకపక్ష విభజనను టిడిపి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపే దాకా ప్రక్రియను అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పి, కేంద్రం, కాంగ్రెస్ పార్టీల రాజకీయ స్వార్థ ప్రయోజనాలను ఎండగట్టేందుకు గురువారం తిరుపతిలో ప్రజా గర్జన సభ నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

బాబు 1

బాబు 1

చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటనకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ విభజన కుట్రలను, అవినీతిని దుయ్యబట్టారు.

బాబు 2

బాబు 2

తనకు ఏ ఉద్యోగమూ అవసరం లేదని, మళ్లీ సిఎం కావాలని కూడా లేదని, ఇంతకుముందే ఒక పెద్ద రాష్ట్రానికి సిఎంగా ఉన్నానని, ఇప్పుడు కేవలం మీ కోసమే వచ్చానని బాబు చెప్పారు.

బాబు 3

బాబు 3

అవినీతి కాంగ్రెస్ నుంచి మిమ్మల్ని రక్షించడానికే వచ్చానని అయితే, ఎన్నికల ముందు తెరాసను, ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకోవాలన్న దుర్బుద్ధితో కాంగ్రెస్ విభజన నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు.

బాబు 4

బాబు 4

తిరుపతితో ప్రారంభించి రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ 'ప్రజాగర్జన' నిర్వహిస్తామని, తద్వారా ప్రజాచైతన్యం రగిలించి ఆ మూడు పార్టీలను భూస్థాపితం చేసేవరకూ నిద్రపోనని బాబు హెచ్చరించారు.

బాబు 5

బాబు 5

కుప్పం నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించనున్నట్టు వైయస్ జగన్ చేసిన ప్రకటనపై చంద్రబాబు మండిపడ్డారు. 'గజదొంగ జగన్ వస్తున్నాడట. రాష్ట్రాన్ని దోచుకోవడం అయిపోయింది. ఇక్కడికొస్తే కుప్పం కూడా మిగలదు. ఆ పెద్ద మనిషి ఇక్కడికి రావడానికి వీలు లేదు. తరిమికొట్టండి' అని కుప్పం ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

బాబు 6

బాబు 6

అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏ ప్రయోగం చేయాలన్నా కుప్పం నుంచే అమలు చేస్తానని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

బాబు 7

బాబు 7

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో రాష్ట్రాల విభజన జరిగిందని, అందరి ఆమోదంతోనే అవి విడిపోయాయని అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల లబ్ధి కోసం జరుగుతున్న ఎపి విభజనలో ఒక పద్ధతి, సంప్రదాయం, పారదర్శకత ఏమీ లేకుండా పోయిందన్నారు.

బాబు 8

బాబు 8

తెలంగాణ సమస్య చాలా సున్నితమైనదన్నారు. హైదరాబాద్, నిధులు, కాలేజీ సీట్లు, ఉద్యోగాలు, సాగునీటి ప్రాజెక్టులు.. వంటి ఎన్నెన్నో అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయని చెప్పారు.

బాబు 9

బాబు 9

అన్ని సమస్యలకు పరిష్కారం కనుక్కోకుండా రాష్ట్రాన్ని విభజించడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించబోదని, మరో నాలుగు రోజుల తర్వాత ఈ కేంద్రమంత్రులందరూ మాజీలవుతారన్నారు.

బాబు 10

బాబు 10

సిడబ్ల్యూసి తీర్మానమప్పుడు వ్యతిరేకించని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు విభజనని వ్యతిరేకించడంలో అర్థం లేదన్నారు.

బాబు 11

బాబు 11

బిజెపితో పొత్తుపై స్పందిస్తూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని, ముందు విభజన కుట్రను అడ్డుకోవడమే ముఖ్యమని పేర్కొన్నారు.

బాబు 12

బాబు 12

కుప్పం ప్రజల భవిష్యత్తు, భాద్యత తనదేనని, కోర్టు, పోలీసు స్టేషన్ లేని ప్రాంతంగా కుప్పంను తీర్చిదిద్దుతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు.

బాబు 13

బాబు 13

2014లో టిడిపి అధఇకారంలోకి వస్తుందన్నారు. కుప్పం ప్రజలు స్వయం శక్తితో బతికేలా చేస్తానన్నారు. తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల భరతం పడతామన్నారు.

బాబు 14

బాబు 14

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడని ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమైక్య ముసుగు తొడిగారన్నారు.

బాబు 15

బాబు 15

అవినీతిపరులను ఉపేక్షిస్తే రాష్ట్రం పరిస్థితి అధోగతేనని హెచ్చరించారు. అవినీతి, ప్రజా సమస్యలపై టిడిపి రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.

బాబు 16

బాబు 16

తెలుగుదేశం అధికారంలో ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం రచ్చబండకు ప్రజలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు.

బాబు 17

బాబు 17

రాష్ట్ర విభజన ప్రక్రియ తీరు పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మండిపడ్డారు. ఇష్టానుసారం విభజించడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+