రాజధానిపై బాబు బిజీబిజీ, సింగపూర్ అండ(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కోర్ ఏరియా పైన ఫిబ్రవరి రెండవ వారంలో ప్రణాళికను సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాలు మంగళవారం నిర్ణయించాయి. దీనికి సంబంధించి మూడు దశల్లో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాయి.
మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌కు పెట్టుబడుల బాధ్యతను జపాన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రాజధాని నిర్మాణంపై సింపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
ఇప్పటికే రాజధాని మాస్టర్ ప్లాన్ పైన ఒప్పందం చేసుకున్న రెండు ప్రభుత్వాలు క్యాపిటల్ నిర్మాణం పురోగతిపై చర్చించాయి.

హైదరాబాదులో సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు
రాజధాని కోర్ సిటీకి నిర్ణయించిన 8 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణంపై సింగపూర్ బృందం ఫిబ్రవరి 2వ వారంలోగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనుంది.

హైదరాబాదులో సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు
ఏప్రిల్ చివరకు 30 వేల ఎకరాలకు సంబంధించి ఫ్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. అదే విధంగా జూన్ నాటికి పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి.

హైదరాబాదులో సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు విశాఖపట్నంలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

హైదరాబాదులో సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు
సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు అధికారులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. విశాఖ పర్యటన అనంతరం విజయవాడకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications