వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా తెలివితో: డోలు కొట్టి, డ్యాన్స్ చేసిన బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్వాక్రా మహిళలు తీసుకున్న లక్ష రూపాయల వరకూ రుణాలను మాఫీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిపై ఉన్న వడ్డీని కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు.

విశాఖ జిల్లా నక్కపల్లిలో శనివారం జరిగిన స్వయం సహాయక సంఘాల సదస్సులో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేనందువలన డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల రుణాన్నే మాఫీ చేయగలిగానని, పరిస్థితి మెరుగుపడితే, వారికి మరింత ప్రయోజనం చేకూర్చుతానని చెప్పారు.

లోటు బడ్జెట్‌ను పూడ్చేందుకు ఒక పక్క ప్రయత్నిస్తునే, మరోపక్క రుణ మాఫీ కోసం ఆలోచిస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, చంద్రబాబు డప్పు కొట్టారు. మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రిజర్వ్ బ్యాంక్ సహకరించడం లేదని, ఎవ్వరూ అప్పు కూడా ఇవ్వడం లేదని, అయినా తన తెలివితేటలు ఉపయోగించి రుణ మాఫీకి డబ్బులు తెస్తానని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

డ్వాక్రా సంఘాలకు తను శ్రీకారం చుట్టడం వలనే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని అన్నారు. ప్రతి ఒక్క మహిళా సంఘానికి ఒక టాబ్‌లెట్ పిసిని ఇవ్వనున్నామని చంద్రబాబు చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అలాగే సెల్ ఫోన్‌లు కూడా ఇవ్వనున్నానని బాబు చెప్పారు. మహిళలు రాజకీయంగానైనా, వ్యాపారపరంగానైనా ఎదగాలని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలకు మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రజలు తరచు అనారోగ్యాల పాలయ్యేందుకు ప్రధాన కారణం రక్షిత మంచినీరు అందకపోవడమేనని, గిరిజనులను కాపాడేందుకు తమ ప్రభుత్వం మినరల్ వాటర్ పంపిణీ చేపడుతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రహదారి సదుపాయం లేని మారుమూల తండాలకు సైతం ఉపాధి కూలీల ద్వారా నీటిని చేరవేయనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఆదివాసి దినోత్సవం నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 చంద్రబాబు

చంద్రబాబు

వైద్య పరంగా గిరిజనులను ఆదుకునేందుకు పార్టీ తరపున ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా డెంగూ, మలేరియా వంటి వ్యాధులకు వైద్యం నిమిత్తం రూ 2.5 లక్షల ఆర్ధికసాయం అందించనున్నట్టు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

గిరిజనులు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్యం, పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

గిరిజనులకు కెజి నుంచి పిజి వరకూ ఉచిత విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన చోట ఆశ్రమ పాఠశాలను స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

 చంద్రబాబు

చంద్రబాబు

గతంలో అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు ససేమిరా అన్న చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే వాటిని బయటకు తీసేందుకు సిద్ధపడుతున్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

శనివారం అనకాపల్లిలో జరిగిన టిడిపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కులకు భంగం కలుగకుండా తవ్వకాలు జరుపుతామని చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ చుట్టుపక్కల నాలుగు, ఐదు అల్యూమినా కంపెనీలు ఏర్పాటు చేస్తామన్నారు. తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజనులు కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు.

English summary
Photos of Andhra Pradesh CM Chandrababu Naidu in Vishaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X