సేఫ్ గార్డ్‌తో వరద నీటిలోనే బాబు పరామర్శ (పిక్చర్స్)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటలీలో పుట్టిన సోనియా దేశానికి శాపంగా మారిందన్నారు.
వర్షాలకు దెబ్బతిన్న రైతులకు వరికి ఎకరాకు 25 వేల రూపాయలు, చెరకు, పసుపు, అరటి, తదితర పంటలకు హెక్టారుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు ఆదుకోవాలన్నారు. పడవలు నష్టపోయిన మత్స్యకారులకు కొత్త పడవలకు 30 శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. బాధితులకు పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవదని నిర్ణయించుకున్న సోనియా రాష్ట్ర విభజనతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి సీట్లు సంపాదించేందుకు తెలుగువారి మధ్య చిచ్చుపెట్టిందని ఆరోపించారు. ఇటలీ తెలివితేటలు ఎక్కువై ఇండియాలో ఉపయోగిస్తోందని, తెలుగువారు ఆమెకు గుణపాఠం చెప్తారని అన్నారు.
రాష్ట్రంలో జగన్, కెసిఆర్, బొత్స, కిరణ్ వంటి దొంగలను ఆమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇటీవల జగన్ నిర్వహించిన సభకు సోనియా ఆదేశాల మేరకు 18 రైళ్లను నడిపారని ఆరోపించారు. సమైక్య వాదం పేరుతో సోనియాను భుజానికెత్తుకున్న జగన్ ప్రజలను నమ్మించి మోసగించేందుకు కుట్రపన్నుతున్నారన్నారు.

చంద్రబాబు 1
విశాఖ జిల్లాలోని యలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లి నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సోమవారం చంద్రబాబు పర్యటించి రైతులను పరామర్శించారు. చంద్రబాబు సేఫ్ గార్డ్ పెట్టుకుంటున్న దృశ్యం.

చంద్రబాబు 2
వర్షాలకు దెబ్బతిన్న రైతులకు వరికి ఎకరాకు 25 వేల రూపాయలు, చెరకు, పసుపు, అరటి, తదితర పంటలకు హెక్టారుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని, చేనేత కార్మికులకు ఆదుకోవాలని, పడవలు నష్టపోయిన మత్స్యకారులకు కొత్త పడవలకు 30 శాతం సబ్సిడీ ఇవ్వాలని బాబు డిమాండ్ చేశారు.

చంద్రబాబు 3
వరద బాధితులను ఆదుకునేవరకు, ఉదారంగా నష్టపరిహారం చెల్లించే వరకు రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడతానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు 4
పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజలను ముఖ్యంగా రైతులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడంలేదని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు 5
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొద్దునిద్ర నుంచి లేపుతానని, బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాడతానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

చంద్రబాబు 6
తాగునీరు, ఆహారం అందక బాధితులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి మూడు రోజుల తరువాత ఏరియల్ సర్వే పేరిట షికారుకు వస్తున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు 7
విశాఖలోని మునగపాక మండలం చూచుకొండకు చంద్రబాబు పడవలో వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వపై ఒత్తిడి తెచ్చి బాధితులను ఆదుకునే అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications