నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు: చంద్రబాబు (పిక్చర్స్)

రాజమండ్రి: పేదరిక నిర్మూలనకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన నాంది పలుకుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అనేక చారిత్రక ఘట్టాలకు వేదికైన రాజమండ్రి నగరంలో ప్రారంభించిన ‘పిఎం జన్ ధన్ యోజన' కూడా ఒక చరిత్ర సృష్టిస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన పేదవారి జీవితాల్లో మార్పు తెస్తుందన్నారు.

పేద వర్గాలకు గడచిన పదేళ్ల కాలం పీడకలగా మిగిలిందన్నారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. దాంతో దేశంలో అన్ని రంగాల్లో అవినీతి పెరిగి, పేదరికం బాగా పెరిగిపోయిందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇప్పుడు కేంద్రంలో ఎన్‌డిఎ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాయని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనేక విషయాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ప్రజలకు మంచి జరగాలన్నదే ప్రధాన మంత్రి లక్ష్యమన్నారు. ఇప్పటికీ దేశంలో 50 శాతానికి పైగా ప్రజలకు బ్యాంకు ఖాతాలు లేవని, అందరికీ బ్యాంకు ఖాతాలు ఇవ్వాలన్నదే జన్ ధన్ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆధార్‌ను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసిన తరువాత, ఇక నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ఆర్ధిక సహాయం బ్యాంకు ఖాతాలకే జమవుతుందని, దళారుల బెడద ఉండదన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

బ్యాంకు ఖాతా ఉన్న వారికి 6 నెలలు తరువాత రూ.5000 వరకు ఓవర్ డ్రాప్టు లభిస్తుందని, ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 95శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అందువల్ల అన్ని రకాల పెన్షన్లు, స్కాలర్‌షిప్పులు తదితర నగదు వ్యవహారాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమవుతాయన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అక్టోబరు 2నుండి ప్రారంభించనున్న వెయ్యి పెన్షన్ కూడా బ్యాంకు ఖాతాల్లోనే జమవుతుందన్నారు. బ్యాంకులు అందించే రూపే కార్డుతో లబ్ధిదారులు తమ ఖాతాలో జమయిన మొత్తాన్ని తీసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అమెరికాలో నగదు లావాదేవీలు 2శాతం, ఆస్ట్రేలియాలో 3శాతం మాత్రమే నగదు లావాదేవీలు జరుగుతుంటే, భారతదేశంలో పూర్తిగా నగదు లావాదేవీలే జరుగుతున్నాయన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

నగదు లావాదేవీలు తగ్గితే అవినీతి తగ్గుతుందని, అందుకే జన్ ధన్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతేనన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

పేదలకు పెట్టింది గోరంత, కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టింది కొండంత అని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్డీయే, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో ఇక అవినీతికి అవకాశం ఉండదన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

పేదల ఆకలి తీర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడటానికి రైతు రుణ మాఫీని, ఆడ బిడ్డలను ఆదుకోవడానికి డ్వాక్రా గ్రూపులకు రుణ మాఫీని అమలుచేసి తీరుతామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రైతు రుణ మాఫీకి సహకరించాలని బ్యాంకులను కోరుతున్నామని, ఒకవేళ సహకరించకపోయినాగానీ రాష్ట్రప్రభుత్వమే అమలుచేస్తుందన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాష్ట్రంలోని ఐదారు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని చంద్రబాబు చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తమ అధికారులు 95శాతం ఆధార్ సీడింగ్ చేశారని, బ్యాంకు అధికారులు ఖాతాలు లేనివారి ఇళ్లకే వెళ్లి పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+