ఐమాక్స్‌లో గర్ల్స్ సందడి, గవర్నర్‌కు బొకే (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు బాలల కేరింతలతో నిండిపోయింది. బాలల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రదర్శన పండుగ గురువారం లాంఛనంగా ప్రారంభమయింది. హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులను మురిపించింది.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి డికె అరుణ, బాలీవుడ్ అందాల నటుడు, క్రేజీ హీరో రణబీర్ కపూర్, టాలీవుడ్ హీరో రానా, ప్రముఖులు గుల్జార్, అమోల్ పాలేకర్, భమన్ జుల్కా, పికె మహంతి, శ్రవణ్ కుమార్, కేంద్ర మంత్రి మనీష్ తివారి బాలల చిత్రాలను ఉద్దేశించి ప్రసంగించారు.
దాదాపు 894 చిత్రాలు పోటీ కోసం 72 దేశాలనుంచి వచ్చాయి. ఇందులో బాలలకు నచ్చే విధంగా రూపొందిన ఎంపిక చేసి నేటి నుంచి నగరంలోని పది థియేటర్లలో ప్రదర్శించనున్నారు. బాలల చిత్రాలు పోటీపడే విభాగాలుగా అంతర్జాతీయ లైవ్ యాక్షన్ చిత్రాలలో 15 ఫీచర్ ఫిలింస్, అంతర్జాతీయ యానిమేషన్ చిత్రాలలో పోటీని తొలిసారిగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాలల దినోత్సవం ఆనందంగా జరిగింది.

గవర్నర్
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని రాజ్ భవనంలో చిన్నారులకు శుభాకాంక్షలు చెబుతున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్.

గవర్నర్ 2
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని రాజ్ భవనంలో చిన్నారులకు శుభాకాంక్షలు చెబుతున్న గవర్నర్ నరసింహన్.

ఐమాక్స్ 1
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద గల ఐమాక్స్ థియేటర్ బాలల చిత్రాల కోసం ముస్తాబైన దృశ్యం.

ఐమాక్స్ 2
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద గల ఐమాక్స్ థియేటర్ బాలల చిత్రాల కోసం ముస్తాబైంది. చిత్రాలు చూసేందుకు వచ్చిన చిన్నారులు.

ఐమాక్స్ 3
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద గల ఐమాక్స్ థియేటర్ బాలల చిత్రాల కోసం ముస్తాబైన దృశ్యం.

రవీంద్ర భారతి 1
బాలీవుడ్ అందాల నటుడు రణబీర్‌కపూర్, వ్యాఖ్యతగా వ్యవహరించిన ‘తారే జమీన్‌పర్' బాల నటుడు దర్శిల్ సఫారీ, గంగూబాయ్‌తో కలిసి వేదిక నృత్యం చేసి పిల్లల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.

రవీంద్ర భారతి 2
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతి వద్ద తనను కలిసిన చిన్నారులకు శుభాకాంక్షలు చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

రవీంధ్ర భారతి 3
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో చిన్నారిని ఎత్తుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

రవీంధ్ర భారతి 4
18వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవ ప్రారంభోత్సవంలో బాలలు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్నేకాక, పెద్దలను సైతం విశేషంగా అలరించాయి.

రవీంద్ర భారతి 5
బాలీవుడ్ అందాల నటుడు రణబీర్‌కపూర్, వ్యాఖ్యతగా వ్యవహరించిన ‘తారే జమీన్‌పర్' బాల నటుడు దర్శిల్ సఫారీ, గంగూబాయ్‌తో కలిసి వేదిక నృత్యం చేసి పిల్లల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.












Click it and Unblock the Notifications