టీడీపీలోకి ఎమ్మెల్సీ, 20 ఏళ్లు బాబేనని..(పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఆదివారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆయనతోపాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్ జయకుమార్ రెడ్డి, ఆనం జయ కుమార్ రెడ్డి తదితర నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వారికి పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఆదివారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
ఆయనతోపాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్ జయకుమార్ రెడ్డి, ఆనం జయ కుమార్ రెడ్డి తదితర నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వారికి పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు శ్రామికునిలా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తున్నారని, అందుకే అన్ని పార్టీల నేతలు తెలుగుదేశం పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు.

టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఆకర్షితులవుతున్నారన్నారు.

టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులై పలువురు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు.

టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
టీడీపీ అధికార ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పదిహేను ఇరవై ఏళ్ల వరకు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఢోకా లేదన్నారు.

టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జైలుకు వెళ్తుందన్నారు.

Click it and Unblock the Notifications