నా సీటు ఆంధ్రా గర్ల్‌కు: సచివాలయంలో గోడు (పిక్చర్స్)
హైదరాబాద్: మెడికల్ పీజీలో ఎస్టీ కేటగిరిలో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన తనకు సీటు ఇవ్వలేదని సచివాలయంలో ప్రవీణ నాయక్ అనే విద్యార్థిని కన్నీరుమున్నీరయింది.
తనకు రావాల్సిన దంత వైద్య పీజీ సీటును ఆంధ్రా అమ్మాయికి కేటాయించారని తెలంగాణకు చెందిన ప్రవీణ నాయక్ ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేసేందుకు ఆమె సచివాలయంకు వచ్చింది. కేసీఆర్‌ను కలిసే అవకాశం లభించక పోవడంతో మీడియా ఎదుట తనకు అన్యాయం జరిగిందని కంటతడి పెట్టింది.

ప్రవీణ నాయక్
ఇటీవల జరిగిన డెంటల్ పీజీ ప్రవేశ పరీక్షలో తనకు ఎస్టీ విభగంలో మొదటి ర్యాంకు వచ్చిందని, దీంతో గత నెల 29న జరిగిన కౌన్సెలింగులో ప్రభుత్వ కళాశాలలో సీటు కేటాయించాలని కోరానని ప్రవీణ నాయక్ చెప్పింది.

ప్రవీణ నాయక్
అయితే, మొదటి ర్యాంకు వచ్చిన తనకు కాకుండా మూడో ర్యాంకు వచ్చిన ఆంధ్రా అమ్మాయికి సీటిచ్చారని ప్రవీణ నాయక్ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రవీణ నాయక్
తనను ప్రయివేటు కళాశాలలో చదువుకోమంటున్నారని, తనకు రావాల్సిన సీటును ఆమెకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని ప్రవీణ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రవీణ నాయక్
తనకు న్యాయం చేయాలని ప్రవీణ నాయక్ కోరింది. ఆమె సచివాలయంలో తన గోడు వెల్లబోసుకుంది. కాగా, ప్రవీణ నాయక్‌కు అన్యాయం జరగనివ్వబోమని తెలంగాణ వైద్య విద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications