సరస్వతి: బాబు ఇంటి వద్ద ధర్నా, జగన్ ఫైర్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పలువురు గుంటూరు జిల్లా రైతులు ఆదివారం ధర్నాకు దిగారు.

గుంటూరు జిల్లా మాచవరం మండలంకు చెందిన రైతులు పలువురు లేక్ వ్యూ అతిథి గృహం వద్ద ధర్నా చేస్తూ.. సరస్వతి భూములు తిరిగి అప్పగించాలని నినాదాలు చేశారు.

మరోవైపు, చంద్రబాబు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేరుగా మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

ధర్నా

ధర్నా

దాచేపల్లి-మాచవరం మండలాల రైతులు పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సరస్వతి భూముల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.

ధర్నా

ధర్నా

అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడానికి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ధర్నా

ధర్నా

చంద్రబాబు మోసాలు ప్రశ్నించేందుకే దాచేపల్లి, మాచవరం మండలాల నుండి పెద్ద ఎత్తున రైతులు హైదరాబాదుకు వచ్చారని తెలిపారు.

ధర్నా

ధర్నా

అన్యాయం పైన ప్రశ్నించేందుకు రైతులు వస్తే వారిని అన్యాయంగా పోలీసులతో అరెస్టు చేయించారని వైయస్ జగన్ నిప్పులు చెరిగారు.

 ధర్నా

ధర్నా

రైతుల ముఖాల్లో ఆనందం చూసేందుకే ఎకరాన్ని మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశామని వైయస్ జగన్ ఈ సందర్భంగా తెలిపారు.

 ధర్నా

ధర్నా

ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు అన్నీ వచ్చినా ఏపీ ప్రభుత్వం నుండి మాత్రం అనుమతులు రాలేదని ఆయన ఆరోపించారు.

ధర్నా

ధర్నా

నీళ్లు, కరెంటు లేనిదే ఏ పరిశ్రమను స్థాపించలేమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు.

ధర్నా

ధర్నా

పరిశ్రమల స్థాపనకు నీళ్లు, కరెంట్ ఇవ్వాల్సిన ధర్మం ప్రభుత్వం పైన ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు.

ధర్నా

ధర్నా

సరస్వతి సిమెంటుకు అనుమతులు ఇవ్వకపోగా, మైనింగ్ లీజు రద్దు చేయడం చంద్రబాబు కక్ష సాధింపులో భాగమేనని, ఇది సిగ్గుచేటని జగన్ అన్నారు.

 ధర్నా

ధర్నా

దాచేపల్లి, మాచవరం మండలాలలో మరో ఏడు పరిశ్రమలకు అనుమతులు లభించినా, ఇప్పటి వరకు ఏ ఫ్యాక్జరీని స్థాపించక పోవడం సిగ్గుచేటు అన్నారు.

ధర్నా

ధర్నా


తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భూములను ఎందుకు రద్దు చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ధర్నా

ధర్నా

కోర్టులను ఆశ్రయించి అయినా సరస్వతీ సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టి తీరుతామని, దేవుడు చంద్రబాబుకు మొట్టికాయలు వేసే రోజు దగ్గరపడిందని జగన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+