వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య ముందు అభిమానంతో గంటా ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం తనను ఎంతగానో ఆదరించిందని, అక్కడే తన రాజకీయ పునాది జరిగిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం అన్నారు.

విశాఖకు వచ్చిన వెంకయ్యకు పార్టీ కార్యకర్తలు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖను తానెప్పుడూ మరిచిపోనన్నారు.

ఉత్తరాంధ్రలో టిడిపి-బిజెపి అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. తమ భవిష్యత్ బాగుండాలని ప్రజలు బిజెపికి ఓటేశారని, స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నాయన్నారు.

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

తన జీవితంలో విశాఖపట్నంను మరిచిపోనని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖపట్నంలోనే తన రాజకీయ పునాది పడిందని ఆయన అన్నారు.

 వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

శనివారం విశాఖకు వచ్చిన ఆయనకు బిజెపి శ్రేణులు, నగర నాయకులు సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖకు వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని తెలిపారు.

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

దేశంలోని అగ్రగామి నగరాల్లో విశాఖ గొప్పదని ఆయన అన్నారు. సమస్యలు తీర్చగలరన్న నమ్మకంతోనే విశాఖ ప్రజలు ఎంపీగా హరిబాబును గెలిపించారని చెప్పారు.

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కులం, ధనం కాదని గుణం గెలిపించిందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. పేద ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిన వారే సమర్థ నాయకులవుతారని ఆయన అన్నారు.

 వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

దేశం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. దేశ ప్రజలు మంచి భవిష్యత్ కోసమే భారతీయ జనతా పార్టీకి ఓటేసి స్థిరమైన ప్రభుత్వానికి పట్టం కట్టారని వెంకయ్య నాయుడు అన్నారు.

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. వెంకయ్య నాయుడుని ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, మంత్రి గంటా శ్రీనివాస్, మాజీ ఎంపి మూర్తి, ఇతర బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు సన్మానం చేశారు.

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఎలాంటి సందేహాలు వద్దని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రణాళికా సంఘమే ఇంకా ఏర్పాటు కాలేదని ఆయన చెప్పారు.

 వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ఉన్న నాటి ప్రధాని మన్మోహనే ప్రత్యేక హోదాకు ఆమోదం తెలిపారని వెంకయ్య తెలిపారు. స్పెషల్ స్టేటస్ గురించి కొత్తగా వచ్చిన మంత్రి అడిగితే ప్రణాళికా శాఖ అధికారులు వివరించారని ఆయన పేర్కొన్నారు.

 వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

పోలవరానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనరేఖ అని వెంకయ్య నాయుడు అన్నారు.

 వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

తెలంగాణకు బిజెపి నష్టం కలిగించదని, అలాగని ఏపీకి అన్యాయం జరుగుతుందని భావిస్తే ప్రధాని నరేంద్ర మోడీ చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు.

 వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

ఏపీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. పోలవరంపై గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేశామని, దీనిని రాజకీయం చేయవద్దని వెంకయ్య అన్నారు.

English summary
Photos of felicitation to venkaiah naidu in vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X