వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానికోసం ఏర్పాటు చేసిన హుండీ ఇలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మించేందుకు విరాళాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సచివాలయంలో చందాల కోసం ప్రత్యేకంగా హుండీ ఏర్పాటు చేసింది.

హైదరాబాదులోను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎల్ బ్లాకులో ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఉన్న రెండు లిఫ్ట్‌ల మధ్య హుండీని ఏర్పాటు చేశారు.

దేవాలయాల్లో ఉండే హుండీని పోలి ఉండే విధంగా స్టీల్‌తో దీన్ని తయారు చేయించారు. హుండీపై ప్రభుత్వ లోగో ఉంది. లోగో కింద ‘ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి విరాళాల నిమిత్తం' (డొనేషన్స్ ఫర్ న్యూ క్యాపిటల్ డెవలప్‌మెంట్ ఫండ్) అని ఉంది. శనివారమే ఏర్పాటు చేసిన హుండీని ఆ తర్వాత తొలగించారు.

 హుండీ

హుండీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మించేందుకు విరాళాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సచివాలయంలో చందాల కోసం ప్రత్యేకంగా హుండీ ఏర్పాటు చేసింది.

 హుండీ

హుండీ

హైదరాబాదులోను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎల్ బ్లాకులో ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఉన్న రెండు లిఫ్ట్‌ల మధ్య హుండీని ఏర్పాటు చేశారు.

 హుండీ

హుండీ

దేవాలయాల్లో ఉండే హుండీని పోలి ఉండే విధంగా స్టీల్‌తో దీన్ని తయారు చేయించారు. హుండీపై ప్రభుత్వ లోగో ఉంది. లోగో కింద ‘ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి విరాళాల నిమిత్తం' (డొనేషన్స్ ఫర్ న్యూ క్యాపిటల్ డెవలప్‌మెంట్ ఫండ్) అని ఉంది. శనివారమే ఏర్పాటు చేసిన హుండీని ఆ తర్వాత తొలగించారు.

 హుండీ

హుండీ

కొత్త రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌లో ఉండటమే కాకుండా.. రాజధాని కూడా లేదు. ఈ నేపథ్యంలో రాజధాని కోసం విరాళాలు సేకరిస్తోంది. అందులో భాగంగా హుండీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

 హుండీ

హుండీ

కొత్త రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హుండీల మార్గం కూడా ఎంచుకుంది. ఏపీ సచివాలయంలో హుండీని ఏర్పాటు చేశారు.

 హుండీ

హుండీ

నూతన రాజధాని నిర్మాణానికి విరాళముల నిమిత్తము అని దానిపై రాసి, ప్రభుత్వ అధికార చిహ్నం కూడా ముద్రించారు. ఈ హుండీల ఏర్పాటు చర్చనీయాంశమైంది. పలువురు అందులో డబ్బులు వేస్తున్నారు.

 హుండీ

హుండీ

హుండీలలో డబ్బులు వేస్తున్న వారు... రాష్ట్రానికి రాజధాని లేదని, ఇలాంటప్పుడు అందుకోసం హుండీలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నారు.

హుండీ

హుండీ

అంతకుముందు లేక్ వ్యూ అతిథి గృహంలో హుండీ పెట్టారు. ఇప్పుడు సచివాలయంలో పెట్టారు. అయితే ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా హుండీ ఏర్పాటు చేయడంపై సందిగ్ధ పడ్డారట.

 హుండీ

హుండీ

సీఎస్‌తో మాట్లాడి ఆ తర్వాత హుండీని తొలగించారు. చంద్రబాబుతో మాట్లాడి లేక్ వ్యూలోని హుండీ కూడా తొలగించే అవకాశముంది.

English summary
A gleaming steel hundi installed on the premises of the Andhra Pradesh Secretariat with ‘Andhra Pradesh Government Capital Development Fund’ inscribed on it was the cynosure of all eyes on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X