వెనక్కి తగ్గి, సీఎం కేసీఆర్ 'దారి'లోకి వచ్చారు (పిక్చర్స్)
హైదరాబాద్: మెట్రో రైలు రూటు మార్పునకు ఎల్ అండ్ టీ అంగీకరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపాదనలకు అంగీకరించింది. అంతేకాకుండా, మెట్రో రైలు ప్రాజెక్టులపై తాము రాసిన లేఖలు మీడియాకు పొక్కడం వల్ల ఏర్పడిన ఇబ్బందులకు కెసిఆర్‌కు క్షమాపణలు చెప్పింది.
చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు దెబ్బతినకుండా, రైలు రూటు మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్‌అండ్‌టీ అంగీకరించింది. రూటు మార్పునకు అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది. రూటు మార్పు వల్ల శాసనసభ ముందు, సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో రైలు వెళ్లదు. పాతబస్తీలోనూ కొన్నిమార్పులు జరగనున్నాయి.
ఈ అంశంపై శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కో ఎల్ అండ్ టీ చైర్మన్ నాయక్, ఇతర ప్రతినిధులు దాదాపు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో మూడు మార్పులు జరిగాయి.

మెట్రో రైలుపై సమీక్ష
మెట్రో మార్గంలో మూడు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేసీఆర్ ప్రతిపాదనలకు ఎల్ అండ్ టీ అంగీకరించింది. లేఖలతో వచ్చిన ఇబ్బందులకు ఎల్ అండ్ టీ క్షమాపణలు చెప్పింది.

మెట్రో రైలుపై సమీక్ష
అసెంబ్లీ భవనానికి చాలా చరిత్ర ఉందని, దాని ముందున్న అమరవీరుల స్థూపంతో తమకు భావోద్వేగ సంబంధం ఉందని, అందువల్ల అసెంబ్లీ ముందు నుంచి కాకుండా, వెనుకవైపు నుంచి లైను వేయాలని కెసిఆర్ తెలిపారు. సుల్తాన్ బజార్‌కు కూడా ఎంతో చరిత్ర ఉందని, ప్రస్తుతం ఉన్నఅలైన్‌మెంట్ మార్చి కోఠి ఉమెన్స్ కాలేజీ వెనుక నుంచి రైలుమార్గం వేయాలని సూచించారు.

మెట్రో రైలుపై సమీక్ష
పాతబస్తీలో వేసే లైన్‌ను అక్కడి ప్రసిద్ధ ప్రార్థనా మందిరాల ముందు నుంచి కాకుండా అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరినట్లుగా మార్చాలని చెప్పారు. ఈ మూడు ప్రతిపాదనలకు ఎల్‌అండ్‌టీ యాజమాన్యం అంగీకరించినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

మెట్రో రైలుపై సమీక్ష
అలైన్‌మెంట్ మార్పులకు సంబంధించి ఈ నెల 20వ తేదీన మళ్లీ సమావేశమై లేఔట్ రూపొందించుకోవాలని రెండు పక్షాలు నిర్ణయించాయి. ఈ సమావేశానికి పాతబస్తీ ప్రజా ప్రతినిధులను సైతం ఆహ్వానించాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రో కారిడార్‌లో కొన్ని ఆస్తుల సేకరణలో ఇబ్బందులునందునే పూర్తిస్థాయి రైట్ ఆఫ్ వే ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి చెప్పారు.

మెట్రో రైలుపై సమీక్ష
మెట్రో పనులు మరింత వేగంగా జరిగేందుకు అవసరమైన భూసేకరణ, కోర్టు వివాదాల పరిష్కారాలు, ట్రాఫిక్ నియంత్రణలు తదితర అంశాలపై త్వరితగతిన స్పందించాలని అధికారులకు సూచించారు.

మెట్రో రైలుపై సమీక్ష
మెట్రో రైలుతోపాటు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే ప్రతిష్ఠాత్మక అభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ భాగస్వామి అయ్యేందుకు ఎల్‌అండ్‌టీ అంగీకరించిందని సీఎంవో కార్యాలయం తెలిపింది.

మెట్రో రైలుపై సమీక్ష
మెట్రో రైలుతోపాటు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే ప్రతిష్ఠాత్మక అభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ భాగస్వామి అయ్యేందుకు ఎల్‌అండ్‌టీ అంగీకరించిందని సీఎంవో కార్యాలయం తెలిపింది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications