డ్రాఫ్ట్ బాక్స్‌లో క్లూ: తల్లి కన్నీరుమున్నీరు (పిక్చర్స్)
హైదరాబాద్: రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఇక్‌ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గురు ప్రసాద్ తన భార్య మీద కోపంతో కన్నకొడుకులకు చంపి పాతిపెట్టాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన గురుప్రసాద్‌కు.. మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌కు చెందిన సుహాసినికి 2004లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (9), నంద విహారి (5) ఉన్నారు.
వీరిద్దరూ బోయినపల్లిలోని సెయింట్ అండ్రూస్ పాఠశాలలో చదువుతున్నారు. గురుప్రసాద్ ఇక్‌ఫాయ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా, సుహాసిని ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ఏడాది క్రితం వీరి కాపురంలో కలతలు రేగాయి. గురుప్రసాద్‌పై సుహాసిని వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత రెండు, మూడుసార్లు రాజీ కుదిరినా కాపురం మాత్రం కుదుట పడలేదు. అనంతరం విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి సంబంధించిన కేసు విచారణలో ఉంది.
సుహాసిని విడిగా నివసిస్తున్నారు. పిల్లలను కూడా ఆ మె తన వద్దే ఉంచుకున్నారు. దీనిపై గురుప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రతి నెలా మొదటి శని, ఆదివారాల్లోనూ, మూడో శనివారంనాడూ ఉద యం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పిల్లలను తన వద్ద ఉంచుకోవడానికి గురుప్రసాద్‌కు ఫ్యామిలీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన నాలుగైదు నెలలుగా పిల్లలను ఈ విధంగా తనతో తీసుకెళ్తున్నారు. ఒకవైపు కోర్టులో కేసు విచారణలో ఉంది.

గురుప్రసాద్
మరోవైపు భార్యాభర్తలిద్దరి మధ్యా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన గురుప్రసాద్.. ఆదివా రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

సుహాసిని
దీనికి ముందురోజు (శనివారం) ఆయన తన ఇద్దరు పిల్లలు విరించి, విహారిలను సుహాసిని వద్ద నుంచి తీసు కెళ్లారు. కోర్టు తీర్పు ప్రకారం గురుప్రసాద్ శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు పిల్లలిద్దర్నీ ఆయన సుహా సినికి అప్పగించాలి.

చిన్నారులు
కానీ రాత్రి వరకూ పిల్లల్ని తీసుకురాకపోవడంతో ఆమె గురుప్రసాద్ ఇంటికి వెళ్లి చూడగా గేటుకు తాళం వేసి ఉంది. దీంతో పిల్లలు కనిపించట్లేదంటూ ఆమె మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గురుప్రసాద్
ఆ మర్నాడే గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. భర్త చనిపోయినప్పటికీ తన పిల్లలి ద్దరూ ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారని ఆమె ఆశించారు. కానీ ఆ తల్లి ఆశలు ఆవిరైపోయాయి.

గురుప్రసాద్
తనకు దక్కని పిల్లలను భార్యకూ దక్కకుండా చేయాలనుకున్న భావనతోనే.. గురుప్రసాద్ ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. భార్య నుంచి నాలుగో తేదీన ఇద్దరు పిల్లలను గురుప్రసాద్ తనతో తీసుకెళ్లారు.

గురుప్రసాద్
అంతకుముందే ఆయన మేడ్చల్‌లోని బీరప్పగూడ రైల్వే స్టేషన్‌కు సమీపాన ఉన్న సొంత స్థలంలో లోతైన గోతిని తవ్వి ఉంచారని, పిల్లలకు తన ఇంట్లో పాలు తాగించి అక్కడికి తీసుకెళ్లి.. అక్కడే వారి మెడలను కత్తితో నరికి, చంపి గోతిలో పూడ్చిపెట్టి ఉంటారని ఘటనా స్థలంలో లభించిన కత్తి తదితర ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు.

గురుప్రసాద్
అందుకు నిదర్శనంగా బాలుర మెడపై కత్తితో నరికిన గాయాలు కనిపిస్తున్నాయి. ఒక బాలుడి తలపై ఇనుపరాడ్‌తో కొట్టినట్టుగా గాయాలు ఉన్నాయి.

గురుప్రసాద్
అల్వాల్ బీహెచ్‌ఈఎల్ క్వార్టర్స్‌లోని ఆయన ఇంట్లో రెండు పాల గ్లాసులు, ఒక తాడు పోలీసులకు లభ్యమయ్యాయి. దీంతో పిల్లలకు పాలలో మత్తు కలిపి ఇచ్చి, తాడుతో పీక బిగించి చంపి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యలు చేయడానికి గురుప్రసాద్‌కు వేరెవరైనా సహాయం చేశారా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గురుప్రసాద్
గురుప్రసాద్ మొబైల్‌లోని డ్రాఫ్ట్ బాక్స్‌లో ఉన్న ఈ మెసేజే విరించి, విహారిల మృతదేహాలను గుర్తించడానికి కీలక ఆధారమైంది. నాలుగో తేదీన ఇద్దరు పిల్లలను చంపేసిన గురుప్రసాద్ తన సెల్‌ఫోన్ నుంచి భార్య సుహాసిని, స్నేహితులకు ‘‘సీ చిల్డ్రన్స్ బాడీస్ ఇన్ మై ప్లాట్'' అని మెసేజ్ పెట్టారు. కానీ, ఆ మెసేజ్ వారికి చేరకపోవడంతో డ్రాఫ్ట్ బాక్స్‌లోకి వెళ్లిపోయింది.

గురుప్రసాద్
గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్స్, మెసేజ్ వివరాలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. వెంటనే వారు అతడి సొంత స్థలం ఎక్కడుందనే అంశంపై ఆరా తీసి మేడ్చల్‌లోని బీరప్పగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆ స్థలం వద్దకు చేరుకున్నారు.

గురుప్రసాద్
అక్కడ రెండు రోజుల క్రితం గొయ్యి తవ్వి పూడ్చినట్టు ఉండడంతో మట్టిని తొలగించి చూడగా విరంచి, విహారి మృతదేహాలు బయటపడ్డాయి. 200 గజాల ఈ స్థలాన్ని గురుప్రసాద్ సుమారు పదేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. అందమైన భవంతిని నిర్మించి హాయిగా ఇక్కడే ఉండాలని ఊహించుకున్న గురుప్రసాద్ కుటుంబంలో 2013 నుంచి కలహాలు మొదలవడంతో కలలన్నీ కల్లలయ్యాయి.

గురుప్రసాద్
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు గురుప్రసాద్ సుదీర్ఘ లేఖ రాశారు. భార్య తరఫు వారు తనను మానసికంగా హింసించారని అందులో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గురుప్రసాద్
భర్త తన పిల్లలకు హాని తలపెడతానని కోర్టుకు ముందే చెప్పానని.. అయినా న్యాయస్థానం తన మాట వినకుండా అతడికి పిల్లలతో గడిపే అవకాశాన్ని ఇచ్చిందని సుహాసిని వాపోయారు. గురుప్రసాద్ అన్యాయంగా నా పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని, కన్న తండ్రి ఎక్కడైనా పిల్లల్ని చంపుతాడా? పిల్లలను గురుప్రసాద్‌కు ఇవ్వొద్దని తాను ముందుగానే న్యాయస్థానానికి విన్నవించినా తన మాట వినలేదని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాను పిల్లలను అతడితో పంపానని, ఈరోజు తనకు తీరని కడుపుకోత మిగిలిందని, అతను తండ్రి కాదు రాక్షసుడు అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తుండటం చూపరులను కంటతడి పెట్టించింది.

గురుప్రసాద్
కన్నబిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్న గురుప్రసాద్ సొంత ఊరు కడప జిల్లాలోని పొద్దుటూరు. ఆయన సోదరి ప్రస్తుతం కడపలో ఉంటున్నారు. గురుప్రసాద్ చాలా మంచివాడని. ఎందుకిలా వ్యవహరించాడో అర్థం కావట్లేదని, అయిదేళ్ల క్రితం కడపకు వచ్చాడని, ఆ తర్వాత నుంచి అతడితో తమకు అంతగా సంబంధాలు లేవని కడపలో ఉంటున్న గురుప్రసాద్ అక్క చెప్పారు. మరో సోదరి హైదరాబాదులోనే ఉంటున్నారు.

గురుప్రసాద్
ఆత్మహత్యకు ముందు గురుప్రసాద్ సుదీర్ఘ లేఖ రాశారు. అతను ఆ లేఖలో ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత వివాదాస్పదంగా మారిన 498(ఏ) సెక్షన్‌పై అతను లేఖల యుద్ధం చేసినట్లుగా బయటపడింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498(ఏ)! వరకట్న వేధింపులు, గృహ హింసకు పాల్పడే భర్త, అత్త మామలు, ఆడబిడ్డలు, ఇతర కుటుంబ సభ్యులపై పెట్టే కేసు! గురుప్రసాద్ ‘నేనూ 498' బాధితుడినే అని తన లేఖలో పేర్కొన్నాడు.

గురుప్రసాద్
తనపై భార్య పెట్టిన కేసు బూటకమంటూ గతంలో ఆయన రాష్ట్ర డీజీపీ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శి వరకు అనేక మందికి లేఖలు రాశారు. 498ఏపై ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. మొత్తం వివాదంలో తన తప్పేమీ లేదని, భార్య తరఫు వారే తనను మానసికంగా, శారీరకంగా హింసించారని గురుప్రసాద్ తన లేఖల్లో పేర్కొనడం గమనార్హం.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications