రాక్షస శేఖర్, కిరాతక కుమార్, చోరు బాబు! (పిక్చర్స్)
హైదరాబాద్: రాజధానిలోని నిజాం కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన సకల జన భేరీ సభ విజయవంతమైంది. తెలంగాణ ఏర్పాటు ఖాయమని, ఈ దశలో తెలంగాణ ఏర్పాటును దేవుడు కూడా అడ్డుకోలేడని తెలంగాణ రాజకీయ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో నేతలు ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటు ఖాయం అనే సందేశాన్ని ఈ సభ ద్వారా తెలంగాణకు పంపించారు. లక్షమంది జగన్, చంద్రబాబు, కిరణ్‌లు వచ్చినా తెలంగాణ ఏర్పాటును ఆపలేరంటూ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, న్యూ డెమోక్రసీ పార్టీతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలంతా తెలంగాణ ఏర్పాటుపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు.
సభలో పలువురు తెలంగాణవాదులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిలు తెలంగాణ వ్యతిరేకులు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

వైయస్
తెలంగాణ పాలిట రాక్షస శేఖర రెడ్డి అంటూ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రాన్ని ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న తెలంగాణవాదులు.

కిరణ్
తెలంగాణ పాలిట కిరాకత కుమార్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్రాన్ని ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న తెలంగాణవాదులు.

వైయస్ అండ్ బాబు
తెలంగాణ పాలిట రాక్షస శేఖర రెడ్డి, చోరుబాబు నాయుడు అంటూ వైయస్, చంద్రబాబు నాయుడుల చిత్రాలను ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న తెలంగాణవాదులు.

చిలుకలూరి పేట.. లాల్ దర్వాజ..
చిలుకలూరిపేట మీది.. లాల్ దర్వాజా మాదీ, తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న తెలంగాణవాదులు.

జై తెలంగాణ
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ చిత్రాలతో తెలంగాణ ముస్లింల ప్రదర్శన.












Click it and Unblock the Notifications