లైట్లు ఆర్పి, జగన్ గాయబ్!: చెమట తుడుస్తూ(పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష సోమవారం మూడో రోజుకు చేరుకుంది. రెండో రోజైన ఆదివారం ఆయనకు పలువురు సంఘీభావం తెలిపారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన సమైక్యవాదులు మద్దతు తెలిపారు.

కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కాటంసాని రాంభూపాల్ రెడ్డి దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పలువురు దీక్షా స్థలికి తరలి వచ్చారు. మరోవైపు శనివారం రాత్రి జగన్ దీక్షా శిబిరంలో చాలాసేపు కనిపించక పోవడం చర్చనీయాంశమైందని మీడియాలో వార్తలు వచ్చాయి. వేదిక పైన లైట్లు ఆర్పేసి తెర వేశారట. పక్కనే ఏర్పాటు చేసిన బస్సులో స్నానం చేసి వచ్చేందుకే జగన్ వెళ్లారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ చాలాసేపు ఆయన కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైందని రాశాయి.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఆరు కోట్ల మంది ఆంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలున్నా, అన్ని పక్కనపెట్టి, ఓట్లు, సీట్ల కోసం కేంద్రం తెలుగు ప్రజలను విడదీయడం బాధాకరమన్నారు. సమన్యాయం చేయని స్థితిలో సమైక్యాంధ్రను కొనసాగించాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటం అడుతోందన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దేనికోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

లోటస్ పాండు వద్ద కార్యకర్తలు

లోటస్ పాండు వద్ద కార్యకర్తలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష నేపథ్యంలో లోటస్ పాండుకు తరలి వచ్చిన కార్యకర్తలు.

లోటస్ పాండు వద్ద రెండో రోజు

లోటస్ పాండు వద్ద రెండో రోజు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష నేపథ్యంలో లోటస్ పాండుకు ఆదివారం తరలి వచ్చిన కార్యకర్తలు.

వైయస్ జగన్

వైయస్ జగన్

తన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన వారికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ...

అభిమానం

అభిమానం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష నేపథ్యంలో లోటస్ పాండుకు తరలి వచ్చిన కార్యకర్తలు.

అమ్మ చెమట తుడుస్తూ..

అమ్మ చెమట తుడుస్తూ..

తన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన ఓ అమ్మ నుదుటి చెమట తుడుస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

నమస్కారం

నమస్కారం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు వచ్చిన ఓ వృద్ధురాలు ఆదివారం ఆయనకు నమస్కరిస్తున్న దృశ్యం.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులో దీక్ష చేస్తున్న దృశ్యం.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులో దీక్ష చేస్తూ నమస్కరిస్తున్న దృశ్యం.

వైయస్ జగన్మోహన్ రెడ్డి

వైయస్ జగన్మోహన్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు వచ్చిన ఓ వృద్ధురాలు ఆదివారం ఆయనకు నమస్కరిస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+