రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస వారికీ నో: కేసీఆర్ సర్వే చేశారిలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 11వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు.

ఫార్మాసిటీతో పాటు ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా పరిశోధన కేంద్రం, ఉద్యోగుల కోసం టౌన్ షిప్ అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

రెండు ప్రత్యేక హేలిక్యాప్టర్లలో అధికారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు.

సర్వే

సర్వే

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 11వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు.

సర్వే

సర్వే

ఫార్మాసిటీతో పాటు ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా పరిశోధన కేంద్రం, ఉద్యోగుల కోసం టౌన్ షిప్ అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

సర్వే

సర్వే

రెండు ప్రత్యేక హేలిక్యాప్టర్లలో అధికారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు.

సర్వే

సర్వే

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. తాము పరిశీలించిన ప్రదేశం ఫార్మా సిటీ స్థాపనకు అత్యంత అనుకూలంగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

సర్వే

సర్వే

అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఫార్మాసిటీ నెలకొల్పనున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఫార్మాసిటీ వల్ల ఎలాంటి కాలుష్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామని, పర్యావరణానికి ఏలాంటి విఘాతం కలుగనీయమని స్పష్టం చేశారు.

సర్వే

సర్వే

జీరో లక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థతో ఫార్మాసిటీ పని చేస్తుందని, స్థానిక ఫార్మా కంపెనీలు కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫార్మాసిటీలో 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి వివరించారు.

 సర్వే

సర్వే

ఫార్మాసిటీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఫార్మాసిటీకి ఎంపిక చేసిన స్థలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటంతో ఇక పనులు వేగవంతం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

 సర్వే

సర్వే

ఫార్మాసిటీ కోసం ముఖ్యమంత్రి చూపించిన ప్రదేశం పట్ల ఫార్మా కంపెనీల ప్రతినిధులు కూడా సానుకూలత వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు ముచ్చర్ల ప్రాంతం అన్ని కోణాలలోనూ అనువైందిగా అభిప్రాయపడ్డారు.

సర్వే

సర్వే

ముఖ్యమంత్రివెంట ఫార్మా కంపెనీ ప్రతినిధులు బి పార్థసారథిరెడ్డి, కె రత్నాకర్‌రెడ్డి (హెటిరో), కె సతీష్‌రెడ్డి (రెడ్డి ల్యాబ్‌స్), కె నిత్యానందరెడ్డి (అరబిందో), ఎం నారాయణరెడ్డి (విర్కో), పి ఈశ్వర్‌రెడ్డి (బిడిఎం) తదితరులతో పాటు రెవిన్యూశాఖ కార్యదర్శి మీనా, పరిశ్రమలశాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్ర, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

 సర్వే

సర్వే

సీఎం పర్యటన సందర్భంగా అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అద్దుగుండు బండగుట్ట చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో సాధారణ, ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు.

 సర్వే

సర్వే

గుట్టను గ్రేహౌండ్స్‌ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భారీ భద్రత నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కూడా సమీక్ష ప్రాంతానికి చేరుకోలేకపోయారు. మీడియాతో సహా టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులను సైతం పోలీసులు అనుమతించలేదు.

సర్వే

సర్వే

బుధవారం ఉదయం 11.30 హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్లు బయలుదేరాయి. ముందుగా మూడు హెలికాప్టర్లలో పారిశ్రామికవేత్తలు అద్దుగుండుబండ గుట్ట చేరుకున్నారు. ఆ తర్వాత మరో హెలికాప్టర్‌లో కేసీఆర్‌ అక్కడికి వచ్చారు.

సర్వే

సర్వే

దారిలోనే ముచ్చర్ల భూములను పరిశీలించారు. బండ గుట్టపై సుమారు అరగంటపాటు సమీక్షించారు. ఆ తర్వాత మూడు హెలికాప్టర్లలో సీఎం, పారిశ్రామికవేత్తలు, అధికారులు ఆమన్‌గల్‌ మండలంలోని ఏడు గ్రామాల పరిధిలో దిల్‌‌కు కేటాయించిన భూములను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.

 సర్వే

సర్వే

ఆ తర్వాత తిరిగి గుట్టకు చేరుకున్నారు. ఆ తర్వాత మరో విడత సమీక్ష, మధ్యాహ్న భోజనం ముగిశాక 2.20 గంటలకు కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు.

English summary
Photos of K Chandrashekar Rao visit to Kandukur Mandal Mucharla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X