చెప్పులు చూపిన ఓయు, వెళ్లిపోయిన కెసిఆర్(పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న నరేంద్ర మోడీ తెలంగాణ దుష్మన్ అని తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు.

రంగారెడ్డి జిల్లా తాండూరు, పరిగి, మెదక్ జిల్లా సంగారెడ్డి, కుషాయిగూడ, బోడుప్పల్, సికింద్రాబాద్ చిలకలగూడ, ఎల్బీనగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.

భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి లౌకిక పార్టీగా కొనసాగుతుందని, బిజెపితో జత కట్టే ప్రసక్తే లేదని కెసిఆర్ తన సభలలో కుండబద్దలు కొట్టారు.

కెసిఆర్

కెసిఆర్

సోనియా, రాహుల్, మన్మోహన్ సహా జాతీయ నాయకులు, చంద్రబాబు అంతా తనను టార్గెట్ చేసి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఈ బక్కోడిని కొట్టడానికి ఇంతమందా? అని కెసిఆర్ చమత్కరించారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేశామని, కష్టపడి 60 ఏళ్ల కలను సాకారం చేసుకున్నామని, తెలంగాణ సాధించుకున్న వెంటనే ఎన్నికలు రావడం అదృష్టమన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ ఎన్నికలే తెలంగాణ భవిష్యత్ తలరాతను రాస్తాయని, వీటిని ఆషామాషీగా తీసుకోవద్దని, ఎన్నికలను చారిత్రక అవసరంగా భావించి తెరాసను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి తెలంగాణవాది పైనా ఉందన్నారు.

కెసిఆర్

కెసిఆర్

60 ఏళ్లుగా ఆంధ్రా సీఎంలు ఉండబట్టే నష్టపోయామని, ఇక మనం నష్టపోవద్దని, ఇక ఎవరు అడ్డమొస్తరో చూస్తానని, తెలంగాణ బిడ్డలందరికీ న్యాయం చేసేందుకే పని చేస్తానని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములను కొల్లగొట్టిన ఆంధ్రోళ్ల నుంచి వాటిని స్వాధీనం చేసుకుంటామని, సాగునీటి వనరులు లేని జిల్లాను సస్య శ్యామలం చేస్తానని, అందుకు ప్రణాళిక తన వద్ద ఉందని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

పాలమూరు ఎత్తిపోతల ద్వారా పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల ప్రాంతాల్లో ఆరు లక్షల ఎకరాల భూములను సాగులోకి తెస్తానని హామీ ఇచ్చారు.

కెసిఆర్

కెసిఆర్

కాంగ్రెస్‌తో 60 ఏళ్లు కలిసి ఉన్నారని, ఏమీ చేయలేదని, ఇప్పుడు తెరాసతో కలవండని, మైనార్టీలకు ఏం చేయాలో చేసి చూపిస్తామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడం తెరాసతోనే సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌కు ఐటిఐఆర్ వస్తోందని, నగరాన్ని ప్రణాళికాబద్ధంగా ఇప్పుడున్న దానికంటే మూడింతలు అభివృద్ధి చేయాల్సి వస్తోందని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించేందుకు చక్కటి ప్రణాళికను రూపొందిస్తానని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

తాండూరు కందిపప్పు అంటే తనకెంతో ఇష్టమని, హైదరాబాద్‌లో ఎవరైనా దానిని ఇష్టంతో కొనుక్కుంటారని, దానికి మరింత ప్రాధాన్యం కల్పించేందుకు తాండూరులో కంది పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు మేలైన వంగడాలను పండిస్తామని చెప్పారు.

ఓయు

ఓయు

తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులను మోసం చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేస్తామని కెసిఆర్ ప్రకటించారని విమర్శిస్తూ ఓయులో విద్యార్థులు నిరసన తెలిపారు.

ఓయు

ఓయు

ఓయులో విద్యార్థులు కెసిఆర్‌ను అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓయు ఏ గ్రౌండ్‌లో హెలికాప్టర్ దిగగానే విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేస్తూ హెలికాప్టర్‌పై రాళ్ళ దాడి చేశారు. చెప్పులు చూపించారు.

ఓయు

ఓయు

అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు త్యాగాలు చేసి సాధించిన తెలంగాణలో విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేస్తామని ప్రకటనలు చేయడం మరోసారి విద్యార్థులను మోసం చేయడమేన్నారు.

ఓయు

ఓయు

తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కెసిఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే యువత నిరుద్యోగులుగా మారి రోడ్లమీద పడేసే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓయు

ఓయు

వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఓయు

ఓయు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేదు అనుభవం ఎదురయింది. విద్యార్థులు కెసిఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

ఓయు

ఓయు

తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన ఓయులోనే కెసిఆర్‌కు నిరసన సెగ తగలడం మింగుడు పడని విషయం. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమమబ్ధీకరిస్తామన్న కెసిఆర్ వ్యాఖ్యల పైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కెసిఆర్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.

ఓయు

ఓయు

దీంతో ఆయన హెలికాప్టర్ దిగకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. చిలకలగూడలో ఆదివారం సాయంత్రం జరగాల్సిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన హెలికాప్టర్‌లో ఓయుకు వచ్చారు.

ఓయు

ఓయు

అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గాన చిలకలగూడ వెళ్లాల్సి ఉంది. అయితే కెసిఆర్ రాక గురించి తెలిసిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో మైదానం వద్దకు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓయు

ఓయు

విద్యార్థులు గ్రౌండ్ లోపలకు వెళ్లకుండా గేట్లు మూశారు. కెసిఆర్ హెలికాప్టర్ రాగానే విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పైన ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.

ఓయు

ఓయు

విద్యార్థులతో మాట్లాడేందుకు ఆయన సుమారు ఇరవై నిమిషాల పాటు చూసినా.. వారు శాంతించలేదు. దీంతో ఆయన వెనుదిరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+