రాజధానిపై వ్యాఖ్య: తిరుమలలో కేఈ ఇలా (పిక్చర్స్)
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో భూముల క్రయ విక్రయాలను ఆన్‌లైన్‌లో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు.
ఆదివారం తిరుమల వచ్చిన ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా రెవెన్యూ సంబంధిత అంశాలను ప్రస్తావించారు.
ఆస్తులు, భూముల రిజిష్ట్రేషన్లను సులభతరం చేసేందుకు ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోందన్నారు.

కేఈ కృష్ణమూర్తి
రాజధానిగా కర్నూలును మించిన నగరం మరొకటి లేదని కొద్ది రోజుల క్రితం చెప్పిన కేఈ కృష్ణమూర్తీ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలోని ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడమే మేలని ఈ రోజు పేర్కొన్నారు.

కేఈ కృష్ణమూర్తి
అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను సమానంగా అభివృద్ది చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దిశగానే తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.

కేఈ కృష్ణమూర్తి
ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ సందర్భంగా చెప్పారు.

కేఈ కృష్ణమూర్తి
స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ నుంచి రాష్ట్రానికి భారీగా ఆదాయం లభిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కేఈ కృష్ణమూర్తి
ఆదివారం తిరుమల వచ్చిన కేఈ కృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.












Click it and Unblock the Notifications