టిపై మళ్లీ కిరణ్: సిఎంకు గల్లా అరుణ ఫ్లవర్స్ (పిక్చర్స్)
చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము కేంద్రంతో, పార్టీ అధిష్టానంతో చివరి వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. చిత్తూరు జిల్లా జిల్లెలమందలోని రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విభజన నిర్ణయం ఆటంబాంబులా వచ్చి పడిందన్నారు.
రాష్ట్ర విభజనను ఆపేందుకు తన పదవిని సైతం త్యాగం చేస్తానని చెప్పారు. విభజన జరిగితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయన్నారు.
పెద్ద రాష్ట్రం కావడం వల్లనే కేంద్రం నుంచి మనకు ఎక్కువగా నిధులు వస్తున్నాయని చెప్పారు. సమైక్య రాష్ట్రం కోసం తమ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదన్నారు. అధిష్టానాన్ని చివరికి ఒప్పిస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు.

కిరణ్ 1
చిత్తూరు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలుకుతున్న జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులు.

కిరణ్ 2
చిత్తూరు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలుకుతున్న జిల్లా మంత్రి గల్లా అరుణ కుమారి.

కిరణ్ 3
చిత్తూరు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలుకుతున్న జిల్లాకు చెందిన నేతలు.

కిరణ్ 4
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు. జిల్లాలో పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు.

కిరణ్ 5
చిత్తూరు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల నూతన భవనం ప్రారంభిస్తున్న దృశ్యం.

కిరణ్ 6
చిత్తూరు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతిలో చిత్తూరు జిల్లా సమగ్ర త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.

కిరణ్ 7
రచ్చబండ కార్యక్రమం కోసం, పలు కార్యక్రమాలను ప్రారంభించేందుకు చిత్తూరు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బ్యాట్ పట్టిన దృశ్యం.

కిరణ్ 8
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీని ప్రారంభించారు. కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలో బిజీగా పర్యటిస్తున్నారు.

కిరణ్ 9
చిత్తూరు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీ సిటీలో మట్టి తవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్న దృశ్యం. చిత్తూరు జిల్లాలో బిజీగా పర్యటిస్తున్నారు.

కిరణ్ 10
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీకి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి యాజమాన్యం, స్థానిక నేతలు బుధవారం ఘన స్వాగతం పలికారు.

కిరణ్ 11
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీకి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెట్లు నాటుతున్న దృశ్యం. రణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలో బిజీగా పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications