కిరణ్ జాగ్రత్తగా దాటేశారు! చెయ్యేసి హామీ (పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలను చూసిన కిరణ్.. చెరువులా.. పంట పొలాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
బాధితులను పరామర్శించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఐదు రోజులకు పైగా నీళ్లలో ఉండి, పనులు చేసుకునే వెసులుబాటు లేని వారికి ఇరవై కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు కిరణ్ చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ప్రకాశం జిల్లా చీరాలలోని సాయి నగర్ కాలనీలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్న సమయంలో వెంట కేంద్రమంత్రి పనబాక లక్ష్మి కూడా ఉన్నారు. ఈ సమయంలో పలువురు సమైక్యవాదులు సిఎం జిందాబాద్, పనబాక డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొంత ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీసులు వారిని సముదాయించారు.

కిరణ్ 1
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు.

కిరణ్ 2
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు.

కిరణ్ 3
ఐదు రోజుల పాటు నీళ్లలో ఉండి, పనులు చేసుకునే వీలులేని వారిని ఆదుకునేందుకు ఇరవై కిలోల బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కిరణ్ 4
పొలం సర్వే నంబరు, వేసిన పైరు, రైతు పేరు, కలిగిన నష్టం తదితరుల వివరాలు ఉంటేనే కేంద్రం నుంచి పరిహారం అందే వీలుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

కిరణ్ 5
పంటల నష్టాన్ని లెక్కించేటప్పుడు అధికారులు ఏ ఒక్క రైతు నష్టపోకుండా జాబితా తయారు చేయాలని, తయారైన జాబితాలను జల్లా ఉన్నతాధికారులు కలెక్టర్, సంయుక్త కలెక్టర్, ఆర్డీవో స్థాయిలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని చెక్ చేయాలన్నారు.

కిరణ్ 6
వారం రోజుల్లో అన్ని శాఖల అధికారులు నష్టానికి సంబంధించిన నివేదికలు పూర్తి చేసి ప్రతిపాదనలు పంపించాలని ముఖ్యమంత్రి సూచించారు.

కిరణ్ 7
చేనేత కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి ఐఏవై కింద రూ.70 వేలతో పాటు అదనంగా మరో పదిహేను వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

కిరణ్ 8
గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని వెదుళ్లపల్లికి మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకున్న సిఎం కంకటపల్లి వద్ద కోతకు గురైన వాగును పరిశీలించారు.

కిరణ్ 9
బాపట్ల మీదుగా నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న జిగెళ్లమూడి గ్రామాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం పరిశీలించారు.

కిరణ్ 10
నీలం తుఫాను సమయంలో నష్టపోయిన రైతులకు రూ.1662 కోట్లు పెట్టుబడి రాయిదీగా కలెక్టర్లకు వచ్చింది. అయితే పంపిణీ జరగడం లేదు. దీంతో వారం రోజుల్లో రైతుల ఖాతాలలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు.

కిరణ్ 11
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఫోన్‌లో సమీక్ష జరిపారు.

కిరణ్ 12
ఐదు రోజుల పాటు నీళ్లలో ఉండి, పనులు చేసుకునే వీలులేని వారిని ఆదుకునేందుకు ఇరవై కిలోల బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications