సమైక్యవాదినే.. ముందుకెళ్లండి కానీ: కిరణ్ (పిక్చర్స్)
చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలోని ప్రముఖుల గదిలో తనను కలిసిన పలువురితో కిరణ్ మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నానని, విభజనతో వచ్చే సమస్యలను అధిష్టానానికి తెలియజేశానని చెప్పారు.
ఉద్యమాలు చేసుకోవచ్చు కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనను పలువురు ప్రజాప్రతినిధులు, సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారు కిరణ్ శుక్రవారం మాట్లాడిన మాటల పట్ల కితాబిచ్చారు.

కిరణ్‌కు ఘన స్వాగతం
సమైక్యాంధ్రకు మద్దతుగా గట్టిగా తన గొంతు వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తూరు జిల్లాలో శనివారం ఘనస్వాగతం లభించింది.

విమానాశ్రయం
చిత్తూరు జిల్లా తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుండి భద్రతా సిబ్బందితో బయటకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృశ్యం.

పర్యటన
చిత్తూరు జిల్లాలోని తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుండి భద్రతా సిబ్బందితో బయటకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

ఘన స్వాగతం
సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తూరు జిల్లా తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికిన సమైక్యవాదులు.

నెహ్రూ వేషధారణలో
సమైక్యాంధ్రకు మద్దతుగా నిలబడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ చిన్నారి జవహర్ లాల్ నెహ్రూ వేషధారణలో స్వాగతం పలికారు.

అశోక్ బాబు
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం.

మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలు.












Click it and Unblock the Notifications