తెలిసిందని సురేఖ, కాళ్లు మొక్కిన కెసిఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ శాసనమండలి సభ్యులు కొండా మురళి దంపతులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత కొండా దంపతులు కెసిఆర్ సమక్షంలో మంగళవారం టిఆర్‌ఎస్ భవన్‌లో పార్టీలో చేరారు.
మానుకోట సంఘటన దురదృష్టకరమని కొండా సురేఖ పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని తాను గట్టిగా నమ్ముతున్నట్టు చెప్పారు. గతంలో కెసిఆర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నానని, ఈ రోజు ఆయనతో రెండు గంటల పాటు మాట్లాడిన తరువాత తన తప్పు అర్థం అయిందని అన్నారు.
కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే టిఆర్‌ఎస్‌లో చేరానని విమర్శ సరికాదని, తనకు పరకాలలో స్వతంత్రంగా గెలిచేంత బలం ఉందని అన్నారు. కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీకి సేవలు అందిస్తానని తెలిపారు. కెసిఆర్ సాగించిన ఉద్యమం వల్లనే తెలంగాణ సాకారం అయిందని ఆమె తెలిపారు.

తెలిసిందని సురేఖ, కాళ్లు మొక్కిన కెసిఆర్
మానుకోట సంఘటన ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని, అనుకోకుండా జరిగిన సంఘటన అని కొండా సురేఖ తెలిపారు. సమైక్యాంధ్ర కోసం తాను జగన్‌కు మద్దతు ఇవ్వలేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందు వల్లనే మద్దతు ఇచ్చినట్టు తెలిపారు.

తెలిసిందని సురేఖ, కాళ్లు మొక్కిన కెసిఆర్
పదవుల కోసం వెంపర్లాడలేదని, నమ్ముకున్న నాయకుని కోసం పదవులకు సైతం రాజీనామా చేశానని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలనే ఉద్దేశంతోనే టిఆర్‌ఎస్‌లో చేరినట్టు తెలిపారు.

తెలిసిందని సురేఖ, కాళ్లు మొక్కిన కెసిఆర్
టిఆర్‌ఎస్‌పై, కెసిఆర్‌పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు చెప్పారు. కెసిఆర్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని అన్నారు.

తెలిసిందని సురేఖ, కాళ్లు మొక్కిన కెసిఆర్
కొండా దంపతులకు కెసిఆర్ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్‌లో టిఆర్‌ఎస్ బలంగా ఉందని, కొండా దంపతుల చేరికతో మరింత బలపడుతుందని ఎమ్మెల్యే తారక రామారావు తెలిపారు.

తెలిసిందని సురేఖ, కాళ్లు మొక్కిన కెసిఆర్
తెలంగాణ పునర్నిర్మాణం తెలంగాణతోనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారని అందుకే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన తెలిపారు. ప్రజల్లో ఉన్న భావనను గుర్తించే వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు తారక రామారావు తెలిపారు.












Click it and Unblock the Notifications