సలాం: శేఖర్ బాషా, స్వప్న కొత్త షో కేటీఆర్‌చే (పిక్చర్స్)

హైదరాబాద్: బిగ్ ఎఫ్ఎం తమ కొత్త బ్రేక్ ఫాస్ట్ షో 'సలాం తెలంగాణ - ఇది పొడుస్తున్న పొద్దు' అనే శీర్షిక, ఉపశీర్షికతో మంగళవారం హోటల్ మారియట్‌లో ప్రారంభించింది.

సామాన్య మానవుడి జీవితాంశాలు, అతని కలలు, కొత్త రాష్ట్రం, కొత్త విధానకర్తల గురించి సలాం తెలంగాణ చర్చిస్తుందని, కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపించి, తద్వారా భవిష్యత్తును నిర్మించుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపింది.

మంత్రి కేటీ రామారావు, ప్రెస్, ప్రజల సమక్షంలో మంగళవారం విడుదల చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, ప్రముఖ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా, ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 సలాం తెలంగాణ

సలాం తెలంగాణ

సలాం తెలంగాణ షోను ప్రముఖ రేడీయో జాకీ శేఖర్ బాషా, ప్రముఖ టీవీ జర్నలిస్ట్, యాంకర్ స్వప్నలు నిర్వహిస్తారు. గడిచిన మూడు వారాలుగా విద్య, ఆరోగ్యం, పవర్, రవాణా స్మార్ట్ సిటీ, సంస్కృతి, పెట్టుబడి అవకాశం వంటి అనేక అంశాలకు సంబంధించి శ్రోతలను అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

 సలాం తెలంగాణ

సలాం తెలంగాణ

ప్రజలు, అతిథులు లేవనెత్తిన అనేక అంశాల పైన గద్దర్, కవితా ప్రసాద్, తెలంగాణ సంస్కృతి విభాగం డైరెక్టర్ శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మెట్రో డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, టీజేఏసీ కో చైర్మన్ ప్రభాకర రావులు జవాబులు ఇచ్చారు.

 సలాం తెలంగాణ

సలాం తెలంగాణ

ఈ సందర్భంగా అశ్విన్ పద్మనాభన్, బిజినెస్ హెడ్, బిగ్ ఎఫ్ఎం మాట్లాడుతూ.. మన రాష్ట్రం, మన బాధ్యత ఇతి వృత్తం నేపథ్యంలో సలాం తెలంగాణ కార్యక్రమం ప్రారంభించబడిందని చెప్పారు.

 సలాం తెలంగాణ

సలాం తెలంగాణ

ప్రజల ఆశలు, ఆశయాలు ఆకాంక్షలతో పాటు ప్రజల ఆగ్రహం పట్ల కూడా తాము ఆకర్షితులమయ్యామని అశ్విన్ పద్మనాభన్ చెప్పారు.

 సలాం తెలంగాణ

సలాం తెలంగాణ

ఒక రకంగా ప్రభుత్వం, ప్రజల మధ్య అగాధాన్ని ఈ కార్యక్రమం తొలగిస్తుందని, తాము ఊహించినంత మద్దతు ప్రజలు, శ్రోతల నుండి రావడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిందని అశ్విన్ పద్మనాభన్ చెప్పారు.

సలాం తెలంగాణ

సలాం తెలంగాణ

కేవలం మ్యూజిక్కే కాకుండా ప్రజల సమస్యల పట్ల మీడియా ఎలా ప్రతిస్పందిస్తుందో అన్న దానికి తమ ఈ కార్యక్రమం నిదర్శనమని అశ్విన్ పద్మనాభన్ చెప్పారు.

 సలాం తెలంగాణ

సలాం తెలంగాణ

సలాం తెలంగాణ షోను ప్రముఖ రేడీయో జాకీ శేఖర్ బాషా, ప్రముఖ టీవీ జర్నలిస్ట్, యాంకర్ స్వప్నలు నిర్వహిస్తారు. గడిచిన మూడు వారాలుగా విద్య, ఆరోగ్యం, పవర్, రవాణా స్మార్ట్ సిటీ, సంస్కృతి, పెట్టుబడి అవకాశం వంటి అనేక అంశాలకు సంబంధించి శ్రోతలను అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+