చేతులెత్తిన బాబు, పరిటాల సునిత ఆనందం (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో పెడితే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులను అడిగి వారి అభిప్రాయాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇటు విజయవాడ అటు గుంటూరు పట్టణాలను మరోవైపు గన్నవరం, ఇంకోవైపు ఉయ్యూరు వరకూ దానిని విస్తరించగలిగితే హైదరాబాద్ నగరంలో సగం నగరం అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారట.
ఈ నెల 10వ తేదీన శివరామకృష్ణ కమిటీ హైదరాబాద్ రావల్సి ఉన్నా కమిటీ పర్యటన వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం సూచన మేరకు ఈ నెల 14వ తేదీన కమిటీ రాష్ట్రానికి రానుంది. అదే రోజు శివరామకృష్ణ కమిటీతో చంద్రబాబు, మంత్రివర్గ సహచరులు సైతం సమావేశం అవుతారు.
సామాజిక సమీకరణలు చూసుకున్నా, ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి, రవాణా సౌకర్యాలు చూసుకున్నా మిగిలిన పట్టణాల కంటే విజయవాడ చాలా అనువైనదిగా చెబుతున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు నడిబొడ్డున ఉన్న పట్టణం అదే కావడంతో అందరి దృష్టి దానిపై పడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులతో సైతం ఈ అంశాన్ని చర్చించగా.. చాలామంది సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు
కాంగ్రెసు పార్టీ పదేళ్ల పాలన వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఐటి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు
నీటి పారుదల రంగంలో ఫలితాలు రాకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు. 19 నుండి అసెంబ్లీ సమావేశాలుంటాయన్నారు. విభజనలో హేతుబద్ధత లేకపోవడం వల్ల అన్యాయం జరిగిందన్నారు.

చంద్రబాబు
విద్యుత్ రంగాన్ని కాంగ్రెసు పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారని చంద్రబాబు అన్నారు. కాంగ్రెసు పాలనలో రెండు రాష్ట్రాలు భ్రష్టు పట్టాయన్నారు. ప్రచారంలో తాము ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. ఎపిలో పాలనను గాడిలో పెట్టేందుకు వంద రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి చెందిన వారు.

పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న పరిటాల సునిత. పక్కన పరిటాల శ్రీరామ్.

గంటా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న గంటా శ్రీనివాస రావు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం పలువురు అధికారులు, నాయకులు కలిశారు. బాబును కలిసిన అనంతరం బయటకు వస్తూ...

దేవినేని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న దేవినేని ఉమామహేశ్వర రావు.












Click it and Unblock the Notifications