14 రోజుల రిమాండ్: భూమా వెంట కూతురు! (పిక్చర్స్)
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి శనివారం ఎస్పీ రవికృష్ణ ఎదుట లొంగిపోయారు. మధ్యాహ్నం నంద్యాల ఏఎస్పీ బంగ్లాలో ఉన్న ఎస్పీ ముందు హాజరై లొంగిపోతున్నట్లు తెలిపారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో టీడీపీ నాయకులు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఉసిగొల్పి దాడి చేయించినట్లు భూమా పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

భూమా
తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనపై తప్పుడు కేసులు పెట్టించిందని కర్నూలు జిల్లా నంద్యాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు.

భూమా
హత్యాప్రయత్నం కేసులో ఆయన శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినప్పటికీ తాము స్వచ్ఛందంగా కేసు నమోదు చేశామని పోలీసులు కొత్త వాదన వినిపిస్తున్నారని ఆయన అన్నారు.

భూమా
తనను, తమ పార్టీని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసులు బనాయించారని ఆయన అన్నారు. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా తాను బెదరబోనని భూమా నాగిరెడ్డి అన్నారు.

భూమా
ప్రజల కోసం, అభివృద్ధి కోసం ప్రశ్నించిన తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన అన్నారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టినా తాను ధైర్యంగా ఎదుర్కుంటానని ఆయన చెప్పారు. కాగా, నంద్యాల కార్యాలయం పైన దాడిని నిరసిస్తూ టీడీపీ శనివారం నంద్యాలలో బంద్ నిర్వహించింది. భూమా రౌడీయిజం నశించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎస్పీతో భూమా, విజయ సాయి రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చాలాసేపు చర్చించారు. భూమాకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఆయనకు కోర్టు 15 రోజుల రిమాండు ఆదేశించింది. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యే న్యాయమూర్తికి తెలపగా సబ్ జైలుకు పంపాక ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.
భూమా పైన నంద్యాల రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో మూడు కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. పురకపాలక చైర్ పర్సన్ దేశం సులోచన, ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్‌ల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, మహిళను అవమానించారనే కేసులు, కౌన్సిలర్ అనిల్ అమృతరాజు ఫిర్యాదు మేరకు ఎస్టీ ఎస్సీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications