వార్షిక వేడుకలో చిరుకు బదులు నాగబాబు (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో రెండు ప్రఖ్యాత హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ - శ్రీశక్తి (ఎన్‌సిహెచ్‌ఎమ్‌సిటి అనుబంధ సంస్థ, భారత దేశ ప్రభుత్వ పర్యాటక శాఖ), శ్రీశక్తి కాలేజీ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ)లను నడుపుతున్న ది శ్రీశక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ తన 20వ వార్షికోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంది.
ఈ వేడుకలు హైదరాబాదులోని బేగంపేటలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి హాజరవ్వాల్సి ఉండగా.. ఇటీవలి ప్రకటించిన ఎలక్షన్ కోడ్ కారణంగా వార్షికోత్సవానికి హాజరు కాలేకపోయారు.
ఆయన సోదరుడైన నాగబాబు... చిరు స్థానంలో వార్షికోత్సవానికి హాజరయ్యారు. నాగబాబుతో పాటు వార్షికోత్సవానికి శ్రీమతి రంజన్ కుమార్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (రిటైర్డ్) ముఖ్య అతిథులుగా వచ్చారు.

నాగబాబు
ఈ కార్యక్రమంలో భారతీయ సంప్రదాయాలను ప్రతిబింభించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహారము, పూలు, పానియాలతో చేసిన విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది.

పురస్కారాలు ఇచ్చారు
అకాడమిక్స్, కలినరిలో అత్యుత్త ప్రతిభను కనబర్చిన విద్యార్థులు కార్యక్రమంలో పురస్కారాలతో సత్కరింపబడ్డారు. టిడి వేణి (బంగారు పతకం), అప్పారావు (వెండి పతకం) వచ్చాయి.

పురస్కారాలు
కాగా, కాలేజీ మౌళిక సదుపాయాలను అదనంగా అత్యాధునిక వసతులతో ఏర్పాటైన లైబ్రరీ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించబడింది.

చిరు బదులు నాగబాబు వచ్చారు
ఈ వేడుకల్లో నాగబాబు, రంజన్ కుమార్‌లతో పాటు ప్రఖ్యాత హోటల్ యజమానులు, పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications