వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌కు భారీ జనం, లోకేష్‌కు కోపమొచ్చింది (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్/కర్నూలు: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బినామీ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆరోపించారు.

బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణలో జగన్ వేలకోట్లు పెట్టుబడులకు కెసిఆర్ వాచ్‌మెన్‌గా ఉన్నారన్నారు. ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకోరని, ఇది రహస్య ఒప్పందమన్నారు.

తెరాసకు ఓటువేస్తే అధికార మదంతో కెసిఆర్ కుటుంబం డబ్బులు సంపాదిస్తోందని ఆరోపించారు. కొత్త రాష్ట్రాన్ని దొరల తెలంగాణగా మార్చడానికి ప్రయత్నిస్తారన్నారు. ఉత్తరాఖండ్ వరదల సమయంలో తెలంగాణవారే ఎక్కువగా ఇరుక్కున్నారని, చంద్రబాబు స్వయంగా వెళ్లి వారిని తీసుకొచ్చారన్నారు. అప్పుడు కెసిఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎన్నాళ్లు ఫాంహౌజ్‌లో కూర్చుంటారన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

చంద్రబాబునాయుడు 63 ఏళ్ల వయస్సు లో 2,817 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రైతుల సమస్యలు తెలుసుకుని, పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటిస్తే కొంతమంది అసాధ్యమంటున్నారన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

40 ఏళ్లు రాజకీయ, పదేళ్ల పాలన అనుభవం ఉన్న రాజకీయ నాయకుణ్ణి నమ్ముతారా? ఏ అనుభవంలేని రాజకీయ నాయకుణ్ని నమ్ముతారా? అని ప్రశ్నించారు.

నారా లోకేష్

నారా లోకేష్

చేతిగుర్తుకు ఓటు వేస్తే చేతిను నరుక్కున్నట్లేనని, కారుకు ఓటు వేస్తే దొరలకు వేసినట్లని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నో కుంభకోణాలు జరగాయని, సరైన పాలన నరేంద్ర మోడీతో అందుతుందనే ఉద్దేశంతో బిజెపితో పొత్తు పెట్టుకున్నామన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఆర్మూర్ నియోజకవర్గంలో కెసిఆర్ బినామీకి, తెలంగాణ కోసం పోరాడిన నాయకుడికి పోటీ జరుగుతోందని, తెలంగాణ కోసం పోరాడిన రాజారాం యాదవ్‌ను గెలిపించాలన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

రోడ్‌షో సందర్భంగా పోలీసుల తీరుపై లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు ఇటు వైపు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇది అన్యాయమని, దౌర్జన్యమని వ్యాఖ్యానించారు. మన టైం వస్తుంది, కంగారు పడకండి, ప్రభుత్వం మారుతుంది, వారిని ఏం చేయాలో చూసుకుంటాం అని వ్యాఖ్యానించారు.

కిరణ్

కిరణ్

రాష్ట్ర విభజనకు సహకరించి ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశం, జగన్ పార్టీ నేతలను ప్రజలు తరిమికొట్టాలని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

కిరణ్

కిరణ్

కర్నూలు జిల్లా కోడుమూరు, కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ కేంద్రం తన ఇష్టానుసారం రాష్ట్రాన్ని విడదీస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి వారికి సహకరించిన వైకాపా, తెలుగుదేశం నేతలతో పాటు అన్నీ తెలిసి విభజనను అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాష్ట్రాన్ని తాము మాత్రమే అభివృద్ధి చేస్తామని ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిరణ్

కిరణ్

రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమన్నారు. ఆదాయ వనరులు లేని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. విభజనతో తెలంగాణకు కూడా నీటి కష్టాలు అన్నారు.

English summary
Photos of Nara Lokesh tour in Nizamabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X