నారా లోకేష్ హల్‌చల్, వారికి అవినీతిపై క్లాస్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ యువతపై దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా తిరుపతిలో టిఎన్ఎఫ్ కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ యువత తలుచుకుంటే ప్రభంజనం ఖాయమన్నారు.
అవినీతిపరులను తరమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి కాలేజికి వెళ్లి యువతలో చైతన్యం తెస్తామన్నారు. కాంగ్రెస్ దొంగ పుత్రుడు, దత్తపుత్రుడిని నమ్ముకుందని, జగన్‌కు లాలూ గతి తప్పదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

లోకేష్ 1
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన బుధవారం మరోసారి మండిపడ్డారు.

లోకేష్ 2
ఆర్జెడి అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గతే వైయస్ జగన్‌కు పడుతుందని నారా లోకేష్ మండిపడ్డారు.

లోకేష్ 3
అధికార కాంగ్రెసు పార్టీ దొంగపుత్రుడు, దత్తపుత్రుడిని నమ్ముకుందని ఎద్దేవా చేశారు. యువత తలుచుకుంటే ప్రభంజనం ఖాయమన్నారు.

లోకేష్ 4
అవినీతిపరులను తరిమి కొట్టాలని యువతకు సూచించారు. తాను ప్రతి కళాశాలకు వెళ్లి యువతలో చైతన్యం తీసుకు వస్తానని చెప్పారు.

లోకేష్ 5
టిడిపి అధ్యక్షుడి తనయుడు నారా లోకేష్ చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో టిఎన్ఎఫ్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ 6
ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చిత్తూరు జిల్లా తిరుపతికి వచ్చిన నారా లోకేష్‌కు తిరుపతి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చిన స్వాగతించారు.