హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయు గేట్ తన్నారు, 6 తలల విలన్: టెక్కీలు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయ, నిజాం కళాశాల విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు. ఉస్మానియా విద్యార్థులు భారీ ర్యాలీగా బయటకు వచ్చే ప్రయత్నాలు చేశారు.

పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు బయట అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు గేట్లు మూసి, బారీకేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులను అరెస్టు చేశారు.

నిజాం కళాశాల విద్యార్థూలు కూడా బషీర్ బాగ్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణకు అనుకూలంగా, రాయల టికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఓయు 1

ఓయు 1

రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బుధవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వస్తున్న దృశ్యం.

ఓయు 2

ఓయు 2

ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో ఆగ్రహంతో వాటిని కాళ్లతో తంతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు.

ఓయు 3

ఓయు 3

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న విద్యార్థులు. సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకారం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని ఉస్మానియా విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఓయు 4

ఓయు 4

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన నిరసన ర్యాలీలో పదమూడుకు పైగా విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

ఓయు 5

ఓయు 5

ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో అక్కడే బైఠాయించిన విద్యార్థులు. ఈ సందర్భంగా వారు కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

ఓయు 6

ఓయు 6

ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన అనంతరం బయటకు వెళ్లే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.

ఓయు 7

ఓయు 7

ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన అనంతరం బయటకు వెళ్లే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

కళాశాల 1

కళాశాల 1

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్, మొయిలీ, డిగ్గీ, షిండే, ఆజాద్ తదితరుల దిష్టిబొమ్మలను నిజాం కళాశాల విద్యార్థులు ప్రదర్శించారు.

కళాశాల 2

కళాశాల 2

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్, మొయిలీ, డిగ్గీ, షిండే, ఆజాద్ తదితరుల దిష్టిబొమ్మలను ఊరేగిస్తున్న దృశ్యం.

కళాశాల 3

కళాశాల 3

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్, మొయిలీ, డిగ్గీ, షిండే, ఆజాద్ తదితరుల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న దృశ్యం.

రాయల తెలంగాణ

రాయల తెలంగాణ

రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిరసన తెలిపారు.

రాయల తెలంగాణ

రాయల తెలంగాణ

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో బైక్ ర్యాలీ దృశ్యం.

English summary
Osmania University and Nizam College students protest against Rayala Telangana proposal on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X