'జనసేన'పై లాఠీ: పవన్ నవ్వులు, సీరియస్ (పిక్చర్స్)
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అనుసరిస్తున్న దోపిడి విధానంతో నక్సలైట్ ఉద్యమాలు వస్తాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం ధ్వజమెత్తారు.
ఒంగోలులోని ఎబిఎం కాలేజి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజా సంపదను మరింత దోచుకునే ప్రమాదం ఉందన్నారు.
దీంతో యువకులు కడుపుమండి నక్సలైట్లగా మారి ఉద్యమాలు చేస్తారని హెచ్చరించారు. వైయస్ పాలనలో వేలాది కోట్లరూపాయలు దోచుకోవటంతో తెలంగాణాప్రాంతంలో కడుపుమండి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వచ్చిందన్నారు.

పవన్ కళ్యాణ్
చంద్రబాబు పాలనలో తెలంగాణా ఉద్యమాలు ఉన్నప్పటికి వైయస్ హయాంలోనే ఆ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందన్నారు. పోర్టులు, సెజ్‌ల పేరుతో వేలాది ఎకరాల భూములను దోచుకుని రియల్ దందాల బడాబాబులకు కట్టపెట్టడటంతో రెండుప్రాంతాల్లోని ప్రజలు నష్టపోయారన్నారు.

పవన్ కళ్యాణ్
రాష్ట్ర సంపదను ఇంత పెద్ద ఎత్తున దోచుకుంటే నక్సలైట్ ఉద్యమం రాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వారు మట్టికొట్టుకుపోతారని శాపనార్ధాలు పెట్టారు.

పవన్ కళ్యాణ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే భయంకరమైన ఉద్యమాలు వస్తాయన్నారు. తండ్రి మృతిచెందిన 24గంటలలోపే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడ్డారన్నారు.

పవన్ కళ్యాణ్
సిఎం పదవి లేకపోతే చచ్చిపోతారా అంటూ జగన్‌ను పరోక్షంగా విమర్శించారు. గాలి జనార్ధన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుతో వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటాన్ని లంచంగా ఇచ్చారన్నారు. అయినా అవినీతి ఆయన్ని జైలుకు తీసుకువెళ్లిందన్నారు.

పవన్ కళ్యాణ్
పది సంవత్సరాల నుండి తెలుగుదేశంపార్టీ ప్రతిపక్షంలో ఉంటే కెసిఆర్, జగన్‌లు చంద్రబాబును టార్గెట్ చేయటం తనను బాధించిందన్నారు.

పవన్ కళ్యాణ్
కెసిఆర్, జగన్ ఒక్కటే అన్నారు. తనకు పదవులమీద వ్యామోహం లేదని కేవలం ప్రజల భవిష్యత్తుకోసం తాను రాజకీయపార్టీని ఏర్పాటుచేసి ప్రజల భద్రతకోసం చంద్రబాబుకు మద్దతు ప్రకటించానని తెలిపారు.

పవన్ కళ్యాణ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల వద్ద పుష్కలంగా డబ్బులు ఉన్నాయని, వారివద్దనుండి ఓటుకు నగదు తీసుకుని తెలుగుదేశంపార్టీకి, బిజెపి అభ్యర్ధులు ఓట్లు వేయాలన్నారు.

పవన్ కళ్యాణ్
ఇందిరాగాంధీ ఇంటి వారసత్వాన్ని రాహుల్ గాంధీకి రావచ్చుకాని ఇందిరాగాంధీ అనుభవం రాహుల్‌కు లేదన్నారు. రాష్రాన్ని విడగొట్టిన విధానం తనను బాధించిందన్నారు.

పవన్ కళ్యాణ్
హైదరాబాద్‌లో సీమాంధ్రులు ఉండకూడదని ఉంటే తరిమివేస్తామని కెసిఆర్ మాట్లాడుతుంటే ఎందుకు జగన్ నోరువిప్పరని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్
జగన్‌కు అధికారం కట్టబెడితే సీమాంధ్ర ప్రజలకు భవిష్యత్తు ఉండదని, మంచి భవిష్యత్తు కోసంచంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు.

పవన్ కళ్యాణ్
అడ్డగోలుగా సమాజ సంపదను దోపిడీ చేసే జగన్ లాంటి వారు సీమాంధ్రకు సిఎం అయితే భవిష్యత్‌లో ఈప్రాంతంలో తీవ్రవాద, ప్రాంతీయ ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్
జగన్ పాపపు సొమ్ము జనాల్లోకి రావాల్సిందేనన్నారు. అలాంటి వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకే తాను జనసేన పార్టీని స్థాపించానని, యువకులంతా తనతో కలిసి దోపిడీదారులపై పోరాడాలని పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్
అవినీతిపై జగన్ పోరాడి ఉంటే ఆయనకే మద్దతు ఇచ్చి ఉండేవాడినన్నారు. సిఎం కావాలన్న జగన్ కోరిక రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చిందన్నారు.

పవన్ కళ్యాణ్
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్ సీమాంధ్రాకు సిఎం కాలేరని తెలిపారు. 2004 నుంచి రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిందన్నారు.

పవన్ కళ్యాణ్
వైయస్ సిఎం అయ్యాక తనకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ లేకున్నా, ఆయన అనుసరించిన విధానాలు, కొంతమంది వ్యక్తులకు అడ్డగోలుగా సమాజ సంపదను అప్పజెప్పడం తనను కలిచివేశాయన్నారు.












Click it and Unblock the Notifications