రిజైన్ చేశాక..: కిరణ్‌తో వారు మాత్రమే కాదు (పిక్చర్స్)

హైదరాబాద్: పార్లమెంటులో ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) పైన చర్చ ప్రారంభం అయితే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కాగా, కిరణ్‌తో సాయంత్రం సీమాంధ్ర నేతలే కాకుండా అంతకుముందు టిడిపి నేత పయ్యావుల కేశవ్ కూడా కలిశారు.

రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని రద్దు చేయాలా? అనే అంశం ముఖ్యమంత్రితో సీమాంధ్ర నేతలు జరిపిన భేటీలో చర్చకు వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని తీసుకునేందుకు ఎవరు ముందుకు వస్తారనే చర్చ జరగ్గా.. కోస్తాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి సిద్ధంగా ఉన్నారని, అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు.

మరోవైపు కిరణ్ రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వానికి బదులు రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కిరణ్ రాజీనామా చేశాక, ఎవరు ఆ పదవిని తీసుకున్నా సమైక్యవాదులు, సీమాంధ్రుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు ముందుకు రాకపోవచ్చుననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందంటున్నారు.

శత్రుచర్ల

శత్రుచర్ల

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. విలేకరులతో శతృచర్ల విజయ రామరాజు.

టిజి వెంకటేష్

టిజి వెంకటేష్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. భేటీ అనంతరం విలేకరులతో టిజి వెంకటేష్, గంటా, ఏరాసు ప్రతాప్ రెడ్డి.

కాసు

కాసు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటే తాను నడుస్తానని మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం జరిగిన భేటీకి హాజరయ్యారు.

పయ్యావుల

పయ్యావుల

సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు పయ్యావుల కేశవ్ ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.

భద్రత

భద్రత

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు భేటీ కావడంతో భద్రతా దృశ్యం.

అనంత

అనంత

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం అనంతపురం పార్లమెంటు సభ్యులు అనంత వెంకట్రామి రెడ్డి కలిశారు.

హర్ష కుమార్

హర్ష కుమార్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం అమలాపురం పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ కలిశారు.

వీరశివా

వీరశివా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. భేటీ అనంతరం విలేకరులతో వీరశివా రెడ్డి.

టిజి వెంకటేష్

టిజి వెంకటేష్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. భేటీ అనంతరం విలేకరులతో టిజి వెంకటేష్.

సీమాంధ్ర నేతలు

సీమాంధ్ర నేతలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+