అడవుల్లో దాడి: వీరప్పన్ ముఠానా? ర్యాలీ (పిక్చర్స్)
చిత్తూరు: ఎర్రచందనం కూలీల పాశవిక దాడిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారులు శ్రీధర్, డేవిడ్ మృతదేహాలకు సోమవారం సిబ్బంది, కుటుంబ సభ్యులు, జిల్లా అధికారుల సమక్షంలో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఎస్వీ మెడికల్ కళాశాలలో పోస్టుమార్టం నిర్వహించారు.
అనంతరం మృతదేహాలతో నగరంలో భారీ యాత్ర నిర్వహించారు. అటవీశాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు మధ్య నగరంలో ఈ ప్రదర్శన కొనసాగింది. కాగా తమ సహాచరుల హత్యకు నిరసనగా అటవీశాఖ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో శవయాత్రలో పాల్గొన్నారు.
కాగా, జిల్లాలోని శేషాచలం అడవుల్లో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల దాడులపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో సర్వమంగళం అడవుల్లో తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలను గజగజలాడించిన వీరప్పన్ అనుచరులే ఇప్పుడు శేషాచలం అడవుల్లో దాడులకు తెగబడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ర్యాలీ 1
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో దాడులతో అడవిలోకి వెళ్లేందుకే అటవీ సిబ్బంది భీతిల్లుతున్నారు. మరణించిన వీరప్పన్ వద్ద పని చేసిన వారు ఇప్పుడు కూడా అదే వృత్తిలో కొనసాగుతూ వీరప్పన్ మాదిరిగానే దాడులకు తెగబడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ర్యాలీ 2
అటవీశాఖ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న వారిలో వందలాది మందిని ఇప్పటికే అరెస్టు చేసినప్పటికీ దాడులు మాత్రం ఆగకపోవడంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.

ర్యాలీ 3
తాజాగా అరెస్టయిన వారిలో తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవైపు మరణించిన వారి కుటుంబాలకు భారీగా నష్టపరిహారం, ఇతర ప్రయోజనాలు అందించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు స్మగ్లర్లను ఎలా అదుపు చేయాలన్న కోణంలో కూడా ఆలోచన చేస్తోంది.

ర్యాలీ 4
స్మగ్లర్ల ఆట కట్టించేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆత్మరక్షణ కోసం ఆయుధాలను సమకూరుస్తామని పిసిసిఎఫ్ బిఎస్‌ఎస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అటవీశాఖ అధికారులకు ఆయుధాలను సమకూర్చే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు.

ర్యాలీ 5
అటవీశాఖ సిబ్బందికి 250 రైఫిల్స్, 150 డబుల్ బేరల్ గన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అయితే వీటిని ఎలా సంరక్షించాలి అనే అంశంపై కొంత చర్చ జరుగుతున్న కారణంగా ఆయుధాల సరఫరాలో ఆలస్యం జరిగిందన్నారు.

ర్యాలీ 6
నక్సలైట్ల దాడుల్లో మరణించే ప్రభుత్వ సిబ్బందికి అందించే అన్ని రకాల సహాయ సహకారాలను ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన శ్రీధర్, డేవిడ్‌ల కుటుంబాలకు కూడా అందిస్తామన్నారు.

ర్యాలీ 7
10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామన్నారు. అలాగే వారి పిల్లలకు అవసరమైన విద్యాభ్యాసానికి పూర్తిగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

ర్యాలీ 8
శేషాచలం అడవుల పరిధిలోని కడప, తిరుపతి, రాజంపేట, పొద్దుటూరు, నంధ్యాలతోపాటు, గిద్దలూరు, నెల్లూరు డివిజన్లలో ఎర్రచందనం ఎక్కువగా లభిస్తోంది. దుంగలను అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతోఅడవుల్లో పేరుకుపోతున్నాయి. స్మగర్లు ఇష్టానుసారంగా పేట్రేగిపోవడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు.

ర్యాలీ 9
ఎప్పటికప్పుడు కలపను వేలం వేయడం, అమ్మేసేందుకు చర్యలు తీసుకుంటే స్మగ్లర్లు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటుందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి విజ్ఞప్తి చేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు.

ర్యాలీ 10
తమ సహాచరుల హత్యకు నిరసనగా అటవీశాఖ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో శ్రీధర్, డేవిడ్‌ల శవయాత్రలో పాల్గొన్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications