రేవ్ పార్టీల్లో గర్ల్స్ సయ్యాట: ఈ ప్రాంతాల్లో..! (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదులో మాదక ద్రవ్యాల వినియోగం, అశ్లీల నృత్యాలు, రిసార్టుల్లో విందులు అదో జగత్తును మరిపిస్తున్నయి. పబ్బులు, స్టార్ హోటళ్లకు పరిమితమైన మద్యం విందులు ఇప్పుడు కొత్త రూపును సంతరించుకున్నాయి.
రేవ్ పార్టీ పేరుతో సంపన్నుల ఇళ్లు, రిసార్టులు... ఫాంహౌస్‌లకు విస్తరిస్తున్నాయి. అర్ధరాత్రి దాటినా కొనసాగే వేడుకలు... సాధారణానికి భిన్నంగా రేవ్ పార్టీలో కనిపిస్తాయి.
ఢిల్లీ, ముంబై, పుణే నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న ఈ వేడుకలు హైదరాబాదు శివార్లలో క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నగరం, శివారు ప్రాంతాల్లో ముఖ్యమంగా మాదాపూర్, ఎళ్బీనగర్, శామీర్ పేట పరిసరాల్లో గుట్టుగా కొనసాగుతున్నాయి.

రేవ్ పార్టీ
ఢిల్లీ, ముంబైల్లోని కొందరు ఈవెంట్ మేనేజర్లు, నైజీరియన్లు, ఆఫ్రికన్లు ఈ రేవ్ పార్టీలను హైదరాబాదుకు తీసుకు వచ్చారు. మాదక ద్రవ్యాలను అక్కడి నుండే తీసుకు వస్తున్నారు.

దిగుమతి
ఇంటర్నెట్, మెసేజ్‌ల ద్వారా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. యువకులను ఆకర్షించేందుకు ప్రవేశం ఉచితం... యువతులు కూడా వస్తున్నారంటూ సమాచారాన్ని చేరవేస్తున్నారు.

రేవ్
రేవ్ పార్టీకి చెందిన ఒక్కో పార్టీలో గరిష్టంగా ఇరవై మంది, కనిష్టంగా ఆరుగురు పాల్గొనేలా చూస్తారట. వీరిలో చాలామంది అపరిచితులే ఉంటారు.

నగరాల నుండి
పబ్బుల్లో, రెస్టారెంట్లలో విందు, వినోదాల కోసం వచ్చిన బుల్లితెర నటులు, ద్వితీయ శ్రేణి నాయికలు, ముంబై నర్తకీలు, యువకులు సాఫ్టువేర్ కుర్రాళ్లను పరిచయం చేసుకొని వారాంతాల్లో రావాలంటూ ఆహ్వానిస్తారు.

ఈ ప్రాంతాల్లో..
హైదరాబాదులో ప్రధానంగా మాదాపూర్, శామీర్ పేట, శంషాబాద్, జూబ్లిహిల్స్ ప్రాంతాలు రేవ్ పార్టీలకు చిరునామాలుగా మారాయి. పార్టీలు తెల్లవారు జాము వరకు కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications