సమైక్యాంధ్ర కోసం ధర్నా: స్కేటింగ్ నిరసన (పిక్చర్స్)

హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం కొనసాగుతోంది. రెండు నెలలు అయినా ఉద్యమ వేడి చల్లారలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటక వచ్చాక రాజకీయ పార్టీలలో సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త మలుపు తిరిగిందనే చెప్పవచ్చు. ఇన్నాళ్లు తాము సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందున్నామని ఆ పార్టీ చెప్పుకొచ్చింది.

అయితే, గురవారం సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తామని చెప్పడంతో పలువురిలో అనుమానాలు తలెత్తాయి. మొన్న జగన్‌కు బెయిల్, ఇప్పుడు రాజీనామాలు చేసేందుకు సిద్ధం కావడంతో పలువురు సమైక్యవాదులు, టిడిపి నేతలు జగన్ పార్టీ పైన మండిపడ్డారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే టి తీర్మానం అసెంబ్లీకి వస్తే సమైక్య బలం తగ్గుతుందని, అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దపడ్డారని, ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

ఎయు విద్యార్థులు

ఎయు విద్యార్థులు

సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మాననహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు.

ర్యాలీ

ర్యాలీ

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు, సమైక్యవాదుల దృశ్యం.

లాయర్ల ధర్నా

లాయర్ల ధర్నా

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న పలువురు న్యాయవాదులు.

స్కేటింగ్ ర్యాలీ

స్కేటింగ్ ర్యాలీ

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో సమైక్యవాదులు వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. స్కేటింగ్ చేస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం.

కడపలో

కడపలో

సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లాలో సమైక్యాంధ్ర లక్ష గళ గర్జన నిర్వహించారు. ఈ సభలో వేదిక పై నుండి మాట్లాడుతున్న సమైక్యవాదులు.

విజయవాడలో

విజయవాడలో

సమైక్యాంధ్రకు మద్దతుగా కృష్ణా జిల్లా విజయవాడలో సమైక్యవాదులు వినూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. పడవలతో నిరసన.

తిరుపతి

తిరుపతి

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్న సమైక్యవాదులు.

జెఏసి

జెఏసి

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+