జగన్! ఇదిగో లేఖ, వారి అసభ్య చిత్రీకరణ (పిక్చర్స్)
హైదరాబాద్: విభజనకు వ్యతిరేకంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు బుధవారం తలపెట్టిన బంద్ సీమాంధ్రలో విజయవంతమైంది. విభజన నిర్ణయాన్ని వ్యితిరేకిస్తూ చోడవరం ఎమ్మెల్యే రామానాయుడు మాడుగులలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
రామానాయుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసులు సకాలంలో స్పందించి అడ్డుకున్నారు. పాడేరు, అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల్లో తెదేపా, వైకాపా కార్యకర్తలు బంద్‌ను పాటించారు. డిపోల నుంచి ఆర్టీసీ బస్‌లు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
న్యాయవాద జెఎసి ఆధ్వర్యంలో జిల్లా కోర్టుకు తాళాలు వేశారు. ఆర్టీసీ బస్‌లపై రాళ్ళురువ్వడంతో మూడు బస్‌ల అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసులు, న్యాయవాదులకు మధ్య ఘర్షణ జరిగింది.

బంద్ 1
విభజనను నిరసిస్తూ సీమాంధ్రలో సోనియా గాంధీ దిష్టిబొమ్మకు అంతిమయాత్ర, దహన సంస్కారాలు నిర్వహించారు. సోనియాగాంధీ, రాహుల్, మన్మోహన్, షిండే, కమల్‌నాథ్, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్ తదితరుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

బంద్ 2
శ్రీకాకుళం జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఒక్క టెక్కలి డిపో పరిధిలో తప్ప మిగిలిన అన్ని డిపోల బస్సులు మామూలుగానే తిరిగాయి.

బంద్ 3
వాణిజ్య సముదాయాలు మాత్రం స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. విద్యా సంస్థలు ముందురోజే సెలవు ప్రకటించడంతో మూతపడ్డాయి.

బంద్ 4
టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బంద్‌లో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్సు చేరుకొని బస్సులను అడ్డగించాలని చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు.

బంద్ 5
విజయనగరం జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, ఎస్.కోట, బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల్లో రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించి, సోనియా, బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి.

బంద్ 6
రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించడాన్ని నిరసిస్తూ బుధవారం గోదావరి జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. కాగా, విభజనకు అనుకూలంగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన లేఖలను ప్రదర్శించారు.

బంద్ 7
కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేయడంతో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు సైతం మూతపడ్డాయి.

బంద్ 8
తెలంగాణ బిల్లును లోక్‌సభ ఆమోదించడాన్ని నిరసిస్తూ టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల్లో బుధవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది.

బంద్ 9
రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. సోనియా, సుష్మాస్వరాజ్, చంద్రబాబు ఫ్లెక్సీలను పలుచోట్ల దగ్ధం చేశారు.

బంద్ 10
సమైక్యవాదులు రోడ్లపైకి చేరుకుని టైర్లకు నిప్పుపెట్టారు. అనంతపురం జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. నగరంతో పాటు హిందూపురంలో సోనియాగాంధీ, బిజెపి నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు.

బంద్ 11
దిష్టిబొమ్మలపైకి రాళ్లు, చెప్పులు, టమోటాలు, కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. అనంతరం వాటిని దగ్ధం చేశారు. జెఎన్‌టియు, ఎస్కేయూ విద్యార్థులు రహదారులపై రాస్తారోకో నిర్వహించారు.

బంద్ 12
దుకాణాలు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. కడప జిల్లాలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన బంద్ విజయవంతమయింది.

బంద్ 13
పోటాపోటీగా నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో శ్రేణులు బలప్రదర్శనకు దిగాయి. అన్నిప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.
మండల కేంద్రాల్లో సమైక్యవాదులు సోనియా, షిండే, సుష్మస్వరాజ్, కెసిఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి అనంతరం దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications