ఏపీలో తెలంగాణ టూరిజం బస్సు అడ్డగింత (పిక్చర్స్)
హైదరాబాద్/చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతిలో బుధవారం తెలంగాణ టూరిజం బస్సును అడ్డగించారు. ఏపీ నుండి హైదరాబాద్ వెళ్లే టూరిజం సిబ్బంది పైన దాడులు చేస్తున్నారని, దీనికి నిరసనంగా ఏపీ టూరిజానికి చెందిన కొందరు డ్రైవర్లు, సిబ్బంది ఈ ధర్నా చేశారు.
తిరుపతిలోని టూరిజం పీఆర్వో కార్యాలయం వద్ద రెండు గంటలపాటు బస్సును నిలిపివేశారు. అందులోని యాత్రికులను కిందకు దింపారు. హైదరాబాదు పెత్తనం ఇక్కడ చేయండి చూద్దామంటూ ధ్వజమెత్తారు.
అక్కడ తమ పైన అనాగరికంగా ప్రవర్తిస్తారా అని నిలదీశారు. హైదరాబాదులో ఏపీ టూరిజం సిబ్బందిని బయటకు వెళ్లిపోవాలని చెప్పడం సిగ్గుచేటని టూరిజం శాఖ యూనియన్ కార్యదర్శి ప్రసాద్ విమర్శించారు.

బస్సు నిలుపుదల
తమకు హైదరాబాదులో గదులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని టూరిజం శాఖ యూనియన్ కార్యదర్శి ప్రసాద్ ఆరోపించారు.

బస్సు నిలుపుదల
హైదరాబాదులో జరిగిన దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని టూరిజం శాఖ యూనియన్ కార్యదర్శి ప్రసాద్ కోరారు. ఏపీ టూరిజం సిబ్బంది పైన మళ్లీ దాడులకు దిగితే తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

బస్సు నిలుపుదల
ఈ ఆందోళనలో ఏపీ టూరిజం డ్రైవర్లు, సిబ్బంది, మేనేజర్లు పాల్గొన్నారు. అనంతరం సీఐ మురళీధర్ రెడ్డి ఆందోళనకారులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.

బస్సు నిలుపుదల
టూరిజం కార్పోరేషన్లో తెలంగాణ, ఏపీ ఉద్యోగుల కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. హైదరాబాదులో టూరిజం కారాప్రోషన్ ప్రధాన కార్యాలయ విభజన విషయంలో ఇరు ప్రాంతాల ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అది బుధవారం ఆరో రోజుకు చేరుకుంది.హిమయత్ నగర్లోని కార్యాలయం ఆవరణలో, గేటు బయట వేర్వేరుగా ఫ్లెక్సీలు కట్టి ఆందోళన చేశారు.












Click it and Unblock the Notifications