బాబు, కేసీఆర్‌లతో వెంకయ్య ఇలా... దూతనా (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు, తగాదాలు పరిష్కరించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడిని కేంద్రం దూతగా పంపించిందా? ఆంధ్ర, తెలంగాణ సిఎంల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న అగాధం, దీనికి తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు అంశాలు వివాదస్పదంగా మారిన నేపథ్యంలో వెంకయ్య శనివారం ఇద్దరు సిఎంలను మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవలి కాలంలో ఉద్యోగుల పంపకాలు, విద్యుత్, సాగునీరు, రవాణా పన్ను, ఎంసెట్ కౌనె్సలింగ్ వంటి అనేక అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా 1956 నవంబర్ 1కంటే ముందు తెలంగాణలో స్ధిరపడిన వారి పిల్లలే స్ధానికులని, వారికే వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతోంది.
ఇరు రాష్ట్రాల మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో లక్షలాది విద్యార్థులు కూడా అయోమయం, గందరగోళానికి లోనవుతున్నారు. ఈ పరిస్థితులను కేంద్రం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. శనివారం ఉదయం కేంద్రమంత్రి వెంకయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. బయటకు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందించే నిధులు, ఇతర విషయాల గురించి చెప్పినా, లోపల మాత్రం వివాదస్పద అంశాలను వెంకయ్య ప్రస్తావించినట్టు సమాచారం.

కేసీఆర్‌తో వెంకయ్య
కేసీఆర్‌తో భేటీ అనంతరం వెంకయ్య లేక్ వ్యూ విశ్రాంతి భవనానికి వెళ్లి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేంద్రం ఆదుర్దాతో ఉన్నట్టు వెంకయ్య ప్రస్తావించినట్టు తెలిసింది.

వెంకయ్య, కేసీఆర్ కరచాలనం
ఇదేవిధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి అంశంపై కలహిచుకుంటే లాభం కంటే నష్టం ఎక్కువని నచ్చచెప్పి ఉంటారంటున్నారు. ఇటీవల మీడియా సమావేశంలోనూ వెంకయ్య రెండు రాష్ట్రాల సిఎంలు కూర్చుని మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.

వెంకయ్యకు కేసీఆర్ పుష్పగుచ్ఛం
వాస్తవానికి ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం తలపెట్టి పరిష్కరించాల్సినంత వివాదాలేమీ లేకున్నా, చీటికీ మాటికీ కేంద్రం వద్దకు రావడం, లేదా ఫిర్యాదు చేయడం, లేదా పత్రికలకు ఎక్కడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు పల్చనవుతున్నాయని, ఇది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఏమాత్రం మంచిది కాదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

కేసీఆర్, వెంకయ్యల భేటీ
కేసీఆర్, చంద్రబాబుతో ఏం మాట్లాడారో కేంద్ర మంత్రి వెంకయ్య స్పష్టం చేయలేదు. కేవలం అభివృద్ధి కార్యక్రమాలను రెండు రాష్ట్రాల్లో విస్తృతం చేసేందుకే ఇద్దరు సిఎంలతో భేటీ జరిపామని మాత్రమే చెప్పారు.

కేసీఆర్, వెంకయ్యల భేటీ
కానీ ఇరువురు నేతలకు మాత్రం సంయమనం, సామరస్యం మంత్రం బోధించినట్టు తెలిసింది. ఎమ్సెట్ కౌన్సిలింగ్ విషయమై రాద్ధాంతం తగదని ఇరు రాష్ట్రాల అధినేతలకు సూచించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంకయ్య తొలిసారిగా శనివారం కలిశారు.

కేసీఆర్‌తో వెంకయ్య
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో కలిసికట్టుగా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని తెలంగాణ కేసీఆర్‌తో వెంకయ్య అన్నారు.

బాబుతో వెంకయ్య కరచాలనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు, తగాదాలు పరిష్కరించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడిని కేంద్రం దూతగా పంపించిందా? ఆంధ్ర, తెలంగాణ సిఎంల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న అగాధం, దీనికి తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు అంశాలు వివాదస్పదంగా మారిన నేపథ్యంలో వెంకయ్య శనివారం ఇద్దరు సిఎంలను మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

బాబు పుష్పగుచ్ఛం
ఇటీవలి కాలంలో ఉద్యోగుల పంపకాలు, విద్యుత్, సాగునీరు, రవాణా పన్ను, ఎంసెట్ కౌనె్సలింగ్ వంటి అనేక అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా 1956 నవంబర్ 1కంటే ముందు తెలంగాణలో స్ధిరపడిన వారి పిల్లలే స్ధానికులని, వారికే వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతోంది.

బాబుతో వెంకయ్య భేటీ
కేసీఆర్, చంద్రబాబుతో ఏం మాట్లాడారో కేంద్ర మంత్రి వెంకయ్య స్పష్టం చేయలేదు. కేవలం అభివృద్ధి కార్యక్రమాలను రెండు రాష్ట్రాల్లో విస్తృతం చేసేందుకే ఇద్దరు సిఎంలతో భేటీ జరిపామని మాత్రమే చెప్పారు.

Click it and Unblock the Notifications