వారి బాధను చూసి జగన్ చలించిపోయారు (పిక్చర్స్)
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తూర్పు గోదావరి జిల్లాల్లో హెలెన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. వరుస తుఫానులతో నష్టపోయిన రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తుఫాన్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం గాలికి వదిలేశారని మండిపడ్డారు.
నష్టపోయిన రైతులకు వడ్డీ లేకుండా కొత్త రుణాలు ఇవ్వాలని, ఎకరాకు పదివేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీలం తుఫాను బాధితులకు ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు మంచి రోజులు వస్తాయన్నారు.
రాష్ట్రంలో పాలకులు పాలనను మరిచి పదవుల కోసం కేంద్రం వద్ద పాకులాడుతున్నారని, తుపాన్ల కారణంగా నష్టపోయిన రైతుల రుణాలను మాఫీచేసి, వడ్డీలేని కొత్త రుణాలు అందరికీ ఇవ్వాలని, 75 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాశామన్నారు.

జగన్ 1
హెలెన్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మంగళవారం కోనసీమకు వచ్చిన జగన్ కొత్తపేట మండలం అవిడి గ్రామ పరిధిలో నష్టపోయిన అరటి రైతులను పరామర్శించారు.

జగన్ 2
మట్ల పట్ట్భారామారావు అనే కౌలు రైతు వేసిన అరటి పంట తుపాను కారణంగా పూర్తిగా నష్టపోవడంతో అతడిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు.

జగన్ 3
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని, రైతు బాగోకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు తుపానుల మీద తుపానులు వస్తున్నా రైతులను పట్టించుకునేవారే లేరన్నారు.

జగన్ 4
నీలం తుపాను వచ్చి సంవత్సరమైనా నేటికీ దాని పరిహారం అందలేదని, మొన్న ఫైలిన్, నిన్న వచ్చిన హెలెన్ తుపానుల నష్టపరిహారం ఎప్పటికి వచ్చేనో అని ప్రశ్నించారు. తక్షణం రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్ 5
రాష్ట్రంలో పరిపాలన ఉందా, లేదా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రశ్నించారు. తూర్పో గోదావరి జిల్లాలో దెబ్బ తిన్న పంటలను ఆయన పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. బాధితులను ఆదుకోని ఈ పాలకులకు మనసు ఉందా అని ఆయన అడిగారు.

జగన్ 6
ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన బాధలను రైతులు జగన్‌కు వినిపించారు.

జగన్ 7
నష్టపోయిన పంటను వారు ఆయనకు చూపించారు రైతుల కష్టాలపై తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తానని జగన్ చెప్పారు.

జగన్ 8
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు, వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌కు కూడా లేఖలు రాస్తానని వైయస్ జగన్ బాధితులకు హామీ ఇచ్చారు.

జగన్ 9
తుఫాను తాకిడికి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని ఆయన కోరారు. నీలం తుఫాను బాధితులకు కూడా ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని చెప్పారు.

జగన్ 10
రైతులను ఆదుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం చూస్తుంటే బాధ అనిపిస్తోందని, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద విత్తనాలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.

జగన్ 11
తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో రైతులను ఆయన పరామర్శించారు. అంతకు ముందు ఆయన కొత్తపేట నియోజకవర్గం ఆవిడిలోని హెలెన్ తుఫాను తాకిడి ప్రాంతాలను సందర్శించారు.












Click it and Unblock the Notifications