పవన్ కూడా: జగన్ ధైర్యం, నిలబడతానని.. (పిక్చర్స్)
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో కనిపిస్తున్న సానుకూల స్పందన, ఇతర అంశాలను చూసి ఘన విజయం సాధిస్తున్నామన్న అతివిశ్వాసం ఎన్నికల్లో కొంపముంచిందని పార్టీ ముఖ్య నాయకులు జగన్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది.
రాజమండ్రిలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జగన్ అధ్యక్షతన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గం సమీక్షతో జగన్ ఈ సమావేశాలను ప్రారంభించారు. తుని అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ విజయం సాధించటంతో తొలి సమీక్షా సమావేశం ఆనందంగా సాగింది.
అయినప్పటికీ కొంతమంది నాయకులు లేచి, తమకు తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి వేధింపులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జగన్ మాట్లాడుతూ ఎవరూ భయపడవద్దని, ప్రతి అంశాన్ని అనుకూలంగా మలచుకుని ఉద్యమించాలని, రాష్టస్థ్రాయిలో తాను అండగా నిలబడతానని ధైర్యం చెప్పారు.

సమీక్ష
తొలి రోజు తుని, అమలాపురం, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలను జగన్ నిర్వహించారు. తొలి రోజు సమీక్షా సమావేశాల్లో నాయకులు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్న దాఖలాలు పెద్దగా కనిపించలేదు.

జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పడవ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

సమీక్ష
అతివిశ్వాసమే పార్టీ కొంపముంచిందని, పార్టీ అధికారంలోకి వస్తుందని, గెలుపు ఖాయమని అంతా చెబుతుంటే అతి విశ్వాసాన్ని ప్రదర్శించామని నాయకులు చెప్పారని సమాచారం.

జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పడవ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పడవ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పడవ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

సమీక్ష
దీనికి తోడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై గట్టి ప్రభావాన్ని చూపించిందని నాయకులు చెప్పారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన గోదావరి జిల్లాల్లో రైతు రుణమాఫీ రైతు కుటుంబాలపై పెద్ద ప్రభావాన్ని చూపించిందని నాయకులు చెప్పారు. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, జనసేన అధ్యక్షులుపవన్ కళ్యాణ్ ప్రచారం కూడా తమ విజయావకాశాలను దెబ్బతీశాయని నాయకులు చెప్పినట్టుగా తెలుస్తోంది.

సమీక్ష
పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో సమన్వయ లోపం కూడా ఓటమికి కారణంగా ఇంకొంతమంది చెప్పారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు చెప్పిన విషయాలను జగన్ స్వయంగా నమోదు చేసుకున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి, ఇతర పార్టీలకు లభించిన ఓట్లను బేరీజువేస్తూ కూడా జగన్ సమీక్ష నిర్వహించారు. ఈనెల 6వరకు కూడా సమీక్షా సమావేశాలు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications