వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబును సవాల్ చేసి, గవర్నర్‌తో జగన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో దుండగులు పంటపొలాలను దగ్ధం చేయడం పైన హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని గవర్నర్ నరసింహన్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం విజ్ఞప్తి చేసింది.

పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాజ్ భవన్లో గవర్నర్‌ను కలిసింది. ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది.

గవర్నర్‌ను కలిసిన వారిలో ఆల్ల రామకృష్ణా రెడ్డి, కొడాలి నాని, ఉప్పలేటి కల్పన, గొట్టిపాటి రవికుమార్, మహ్మద్ ముస్తఫా, ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద రావు, సీనియర్ నేతలు పార్థసారథి, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ కాలం, తాను ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే అవకాశాలపై వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

‘‘చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారం ఉందని చెప్పి తన ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు. కానీ ఈ అధికారం ఉండేది రెండు సంవత్సరాలే. జ్యోతిష్కులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఒకవేళ దేవుడు అనుకూలిస్తే నాలుగేళ్లు ఉండొచ్చు. ఏం చేసినా ఆ అధికారం పోయేలోపే. నేను హామీ ఇస్తున్నా.. ప్రతీ రైతుక్కూడా చెబుతున్నా.. మీకందరికీ అంగీకారమైతేనే భూములు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే చంద్రబాబు కాదుగదా.. వాళ్ల నాయనా వచ్చినా కూడా తీసుకోలేడు'' అని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

తాడేపల్లి, మంగళగిరి, నిడమర్రు మండలాలకు చెందిన రైతులతో సోమవారం ఆయన వైసీపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం అయ్యారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఉండవల్లి, కొరగల్లు, పెనుమాక నుంచి పెద్ద ఎత్తున వచ్చిన రైతుల బాధలు వింటుంటే గుండె తరుక్కుపోతోందన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

శాసనసభలో చట్టాలను చదివి వినిపించి, రైతులు ఒప్పుకొంటేనే రాజధానిని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, కానీ ప్రస్తుతం రైతులను భయపెట్టి కుట్రపూరితంగా భూములను లాక్కొంటున్నారన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

టీడీపీ వర్గీయులే పంటలను తగలబెట్టి ఆ నెపాన్ని వైసీపీ నేతలపై మోపాలని చూస్తున్నారన్నారు. విలువైన భూములు ఇచ్చేందుకు అంగీకరించని తమ నేతలపై పోలీసులు కూడా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

రాజధాని నిర్మాణానికి తాము అనుకూలమేనని, కానీ భూములు తీసుకునే విధానమే నచ్చలేదన్నారు. రైతులందరికీ అంగీకారం అయితేనే.. భూములు తీసుకుంటారని లేకపోతే చంద్రబాబు నాయన వచ్చినా తీసుకోలేరని ఆయన సవాల్‌ విసిరారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

మీ కొడుకు, మీ అన్న, మీ తమ్ముడులాంటి నేనే సీఎంని అవుతానని జగన్‌ వారికి చెప్పారు. భూములు తీసుకునే వ్యవహారం భయానక వాతావరణంలో నడుస్తోందన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

పోలీసులు అక్కడ కేవలం వైసీపీ నేతలే లక్ష్యంగా కేసులు నమోదు చేస్తున్నారని, భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని, ఇష్టంతో ఇస్తామంటే తీసుకోండని, వారికి ఇష్టం లేకుండా తీసుకుంటే ప్రతిఘటిస్తామని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్


రియల్‌ వ్యాపారం చేయడానికే ఇదంతా చేస్తున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత భూసేకరణ పేరిట గుంటూరు జిల్లా తుళ్లూరులో జరుగుతున్న అరాచకాలపై సిటింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలని గవర్నర్‌ నరసింహన్‌ను వైయస్ జగన్ కోరారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్


రాజ్‌భవన్‌లో సోమవారం ఆయన గవర్నర్‌ కలిశారు. తుళ్లూరు ప్రాంతంలోని ఆరు మండలాల్లో పంటలు దగ్ధం చేయడం, తప్పుడు కేసులు బనాయించడం, భయబ్రాంతులకు గురి చేయడం వంటి ఘటనలపై సిటింగ్‌ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని గవర్నర్‌ను జగన్‌ కోరారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

దీనిపై పరిశీలిస్తామని నరసింహన్‌ హామీ ఇచ్చారు. గవర్నర్‌తో భేటీ అనంతరం వైసీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ.. తుళ్లూరులో జరుగుతున్న అరాచకాలపై సిటింగ్‌ జడ్జిచే విచారణ కోరామన్నారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

రైతుల పంటలు కాల్చివేశారని, మంటలు ఆరకముందే ఇది వైసీపీ పని అంటూ హోంమంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప చెప్పడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారన్నారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

దర్మాన ప్రసాదరావు, కె.పార్థసారధి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, కొడాలి నాని, రామకృష్ణారెడ్డి తదితరులు జగన్‌తోపాటు గవర్నర్‌ను కలిశారు.

 వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో తణుకులో జగన్‌ 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తారని ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు.

English summary
Photos of YS JAGANMOHAN REDDY MEMORANDUM TO GOVERNOR NARSIMHAN
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X