అమ్మ ఎందుకోడింది, 'దాడి' ఎలా: జగన్ ఆరా (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపై గురువారం విశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జగన్ నిర్వహించిన రెండు రోజుల సమీక్ష గురువారం సాయంత్రం ముగిసింది. తొలి సమీక్షలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలతో పాటు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటమికి కారణాలపై కూలంకషంగా చర్చించారు. తొలి రోజు సమీక్ష గురువారం తెల్లవారుజాము వరకూ కొనసాగాయి.
రెండో రోజు సమీక్షలో భాగంగా విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఓటమికి కారణాలపై చర్చించారు. కీలక నేత ఓటమికి ఎవరు బాధ్యులు అన్న విషయంపై జగన్ లోతుగానే సమీక్షించారు.
ఏడు నియోజకవర్గాలకు గాను విశాఖ పశ్చిమం నుంచి పోటీ చేసిన దాడి రత్నాకర్, ఆయన తండ్రి సీనియర్ నేత దాడి వీరభద్ర రావు గైర్హాజరయ్యారు. సమీక్ష నిమిత్తం జగన్ విశాఖలో ఉన్న సమయంలోనే దాడి వీరభద్ర రావు తీవ్ర విమర్శలు చేయడంపై కూడా సమీక్షలో చర్చకు వచ్చిందని తెలుస్తోంది. అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో దాడి, ఆయన కుమారుడు హాజరు కాలేదు.

జగన్
విశాఖ పరిధిలో ఒక్క సెగ్మెంట్‌లో కూడా పార్టీ అభ్యర్థులు గెలుపొందకపోవడానికి గల కారణాలను జగన్ ఆరా తీశారు. అతి విశ్వాసమే కొంప ముంచిందని పలువురు అభిప్రాయపడ్డట్లుగా తెలుస్తోంది.

జగన్
అంతేకాకుండా ప్రత్యర్థులు చేసిన ప్రచారం కూడా ఓటమికి ప్రధాన కారణమైందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు మితిమీరిన ధీమాతో విజయమ్మ పోటీ చేసిన దృష్ట్యా తమ గెలుపు కష్టమేమీ కాదనే నమ్మకంతో ఎన్నికల నిర్వహణను నిర్లక్ష్యం చేశారని చెప్పారట. ఈ అంశంపై లోతుగా చర్చ జరిగింది.

జగన్
అనంతరం జగన్ మాటలాడుతూ... పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. స్థానిక కార్యకర్తలతో మమేకమై సమన్వయంతో పని చేసేవారికి పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా బలోపేతం చేయాలని నిర్ణయించారు.

జగన్
ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రజల సమస్యలపై పూర్తిస్థాయిలో పోరుకు సన్నద్ధం కావాలని క్యాడర్‌కు జగన్ పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమల్లో చేసే పొరపాట్లను గుర్తించి వైఫల్యాలపై యుద్ధం సాగించాలన్నారు.












Click it and Unblock the Notifications