వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను ముద్దు చేశారు, అతను కూడా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర మంగళవారం చిత్తూరు జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్లకుండా నాటకాలాడుతున్నారన్నారు.

తెలుగు జాతిని విభజిస్తున్న పాపం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీదే అన్నారు. విభజనకు సహకరిస్తున్న చంద్రబాబు, కిరణ్‌లను జాతి క్షమించబోదన్నారు.

అల్మట్టి డ్యాం నిండితే తప్ప రాష్ట్రానికి కృష్ణా నది నీళ్లు వచ్చే అవకాశం లేదన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం ఏడారి అవుతుందన్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తాగేందుకు చుక్క నీరుదొరకదని, యువతకు ఉద్యోగాలు లభించవన్నారు. విద్యార్థులకు ఎవరు భరోసా కల్పిస్తారని ప్రశ్నించారు.

జగన్ 1

జగన్ 1

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లా వాల్మికీపురం మండలంలో మంగళవారం కొనసాగింది.

జగన్ 2

జగన్ 2

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన యాత్రలో ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దు పెడుతున్న దృశ్యం.

జగన్ 3

జగన్ 3

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంగళవారం చిత్తూరు జిల్లాలో మహిళలు బొట్టు పెట్టి స్వాగతం పలుకుతున్న దృశ్యం.

జగన్ 4

జగన్ 4

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని వాల్మికీపురం మండలంలో ఓ కుటుంబాన్ని ఓదార్చుతున్న దృశ్యం.

జగన్ 5

జగన్ 5

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లా వాల్మికీపురం మండలంలో మంగళవారం కొనసాగింది.

English summary

 YSR Congress Pary chief YS Jaganmohan Reddy on Tuesday said CM Kiran Kumar Reddy will not go beyond the brief given to him by Sonia Gandhi on bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X